Photo Credit: Twitter
రాజ్‌కోట్ వేదికగా ఇండియా అండర్-19 జట్టుతో జరుగుతున్న మూడో అనధికారిక వన్డేలో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో జెడ్ హొలిక్ (87) టాప్ స్కోరర్‌గా నిలవగా, నీల్ పటేల్ (51) అర్థసెంచరీ సాధించాడు.
భారత బౌలర్లలో మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా చెరో 3 వికెట్లు పడగొట్టగా, కావ్యా పటేల్, ఆర్యన్ సవ్సానీ చెరొక వికెట్ తీశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత అండర్-19 జట్టు 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ద్రవిడ్ కుమారుడిపై వేటు!
కాగా ఈ మ్యాచ్‌కు ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తొలి వన్డేలో 38 పరుగులు చేసిన అన్వయ్ రెండో వన్డేలో మాత్రం 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో మూడో వన్డేకు అన్వయ్‌ను పక్కనబెట్టిన జట్టు మేనేజ్‌మెంట్ అతడి స్థానంలో రజత్ బగేల్‌ను జట్టులోకి తీసుకొచ్చింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత యువజట్టు చివరి వన్డేలో ప్రయోగాలకు తెరలేపింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు చిగురుపాటి వెంకటతో పాటు రెండో వన్డేలో భారీ సెంచరీ చేసిన యశ్‌బర్దన్ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు.
అదరగొడుతున్న సెహ్వాగ్ కుమారుడు
ఇక ద్రవిడ్ కుమారుడు అన్వయ్ లంక పర్యటనలో ఆకట్టుకున్నాడు. 17 ఏళ్ల అన్వయ్ రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 14, 87 పరుగులుస సాదించాడు. ఇక అండర్-19 జట్టులో ద్రవిడ్ కుమారుడు ఒక్కడే కాదు, మాజీ విధ్వంసకర ఆటగాడు సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగి తొలి వన్డేలో 26 బంతుల్లో 28 పరుగులు, రెండో వన్డేలో 48 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. అంతేకాదు బౌలింగ్‌లోనూ ఆర్యవీర్ తన ప్రతిభను ప్రదర్శిస్తూ రెండో వన్డేలో రెండు కీలక వికెట్లు తీసి విజయంలో తన వంతు పాత్రను పోషించాడు.
ఇదీ చదవండి: ఆసీస్‌పై కుషాగ్ర సెంచరీ.. ఇండియా-ఏ 334 ఆలౌట్


