breaking news
chigurupati Venkata
-
IND vs AUS: ద్రవిడ్ కుమారుడిపై వేటు!.. ఆసీస్ 254 ఆలౌట్
రాజ్‌కోట్ వేదికగా ఇండియా అండర్-19 జట్టుతో జరుగుతున్న మూడో అనధికారిక వన్డేలో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో జెడ్ హొలిక్ (87) టాప్ స్కోరర్‌గా నిలవగా, నీల్ పటేల్ (51) అర్థసెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా చెరో 3 వికెట్లు పడగొట్టగా, కావ్యా పటేల్, ఆర్యన్ సవ్సానీ చెరొక వికెట్ తీశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత అండర్-19 జట్టు 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ద్రవిడ్ కుమారుడిపై వేటు!కాగా ఈ మ్యాచ్‌కు ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తొలి వన్డేలో 38 పరుగులు చేసిన అన్వయ్ రెండో వన్డేలో మాత్రం 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో మూడో వన్డేకు అన్వయ్‌ను పక్కనబెట్టిన జట్టు మేనేజ్మెంట్ అతడి స్థానంలో రజత్ బగేల్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత యువజట్టు చివరి వన్డేలో ప్రయోగాలకు తెరలేపింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు చిగురుపాటి వెంకటతో పాటు రెండో వన్డేలో భారీ సెంచరీ చేసిన యశ్‌బర్దన్ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు.అదరగొడుతున్న సెహ్వాగ్ కుమారుడుఇక ద్రవిడ్ కుమారుడు అన్వయ్ లంక పర్యటనలో ఆకట్టుకున్నాడు. 17 ఏళ్ల అన్వయ్ రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 14, 87 పరుగులు సాధించాడు. ఇక అండర్-19 జట్టులో ద్రవిడ్ కుమారుడు ఒక్కడే కాదు, మాజీ విధ్వంసకర ఆటగాడు సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగి తొలి వన్డేలో 26 బంతుల్లో 28 పరుగులు, రెండో వన్డేలో 48 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. అంతేకాదు బౌలింగ్‌లోనూ ఆర్యవీర్ తన ప్రతిభను ప్రదర్శిస్తూ రెండో వన్డేలో రెండు కీలక వికెట్లు తీసి విజయంలో తన వంతు పాత్రను పోషించాడు.ఇదీ చదవండి: ఆసీస్‌పై కుషాగ్ర సెంచరీ.. ఇండియా-ఏ 334 ఆలౌట్ -
ఆస్ట్రేలియాను వణికించిన తెలుగు కుర్రాడు.. ఎవరంటే?
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత యువ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. పర్యాటక జట్టుపై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్.. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో యశ్వర్ధన్ సింగ్ (122) భారీ సెంచరీతో చెలరేగగా.. ఆర్యవీర్ సెహ్వాగ్ (47), వినీత్ (87) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో థామస్ వాసియో మూడు వికెట్లు పడగొట్టాడు.అనంతరం కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల ధాటికి 41.1 ఓవర్లలో 238 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్ మూడు వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు యశ్వర్థన్ సింగ్ చౌహన్, కావ్య పటేల్ చెరో రెండు వికెట్లు సాధించారు.మన తెలుగు కుర్రాడే!భారత విజయంలో కీలక పాత్ర పోషించిన చిగురుపాటి వెంకట ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జన్మించాడు. అతడి పూర్తి పేరు 'చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్'. ఏపీలో జన్మించినప్పటికీ, అతడు దేశవాళీ క్రికెట్లో గోవా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 18 ఏళ్ల సుభాష్‌కు బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణించే సత్తా ఉంది.గత దేశవాళీ సీజన్లో నాలుగు ప్రధాన టోర్నమెంట్లలో కలిపి మొత్తం 380 పరుగులు చేయడంతో పాటు 49 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కూచ్ బెహార్ ట్రోఫీలో అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ప్రతిష్టాత్మక అండర్-19 టోర్నీలో గోవా జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడంలో సుభాష్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 26 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 224 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనల ఆధారంగానే గతేడాది జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడ లంకతో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించి మెరిశాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు.


