విండీస్‌తో తొలి వ‌న్డే.. జట్టుతో కలవనున్న రో-కో ద్వయం | Rohit Sharma-Virat Kohli Likely-Join Team-Today-Itself-Kerala-1st ODI | Sakshi
Sakshi News home page

విండీస్‌తో తొలి వ‌న్డే.. జట్టుతో కలవనున్న రో-కో ద్వయం

Sep 23 2026 10:47 AM | Updated on Sep 23 2026 11:12 AM

Rohit Sharma-Virat Kohli Likely-Join Team-Today-Itself-Kerala-1st ODI

Photo Credit: Twitter

టీమిండియా సీనియ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి ఇవాళ కేర‌ళంలో అడుగుపెట్ట‌నున్నారు. వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్‌లో భాగంగా తొలి వ‌న్డే సెప్టెంబ‌ర్ 27న తిరువ‌నంత‌పురం వేదికగా జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో గిల్ సార‌థ్యంలోని టీమిండియా బృందం ఇప్పటికే కేర‌ళ‌కు చేరుకోగా.. ఇవాళ కోహ్లి, రోహిత్‌లు జట్టుతో జాయిన్‌ అవనున్నారు. 

టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రో-కో ద్వ‌యం 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నేప‌థ్యంలో కేవ‌లం వ‌న్డే ఫార్మాట్‌లో మాత్ర‌మే కొన‌సాగుతున్నారు. ఇటీవ‌లే ఇంగ్లండ్‌కు వ‌న్డే సిరీస్ కోల్పోయిన‌ప్ప‌టికీ రో-కో మాత్రం త‌మ ప్ర‌ద‌ర్శ‌నతో ఆక‌ట్టుకున్నారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్ ఇంగ్లండ్‌తో మూడో వ‌న్డేలో చారిత్ర‌క సెంచ‌రీతో మెరిశాడు. 

ఇక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు స‌రిగ్గా ఏడాది స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో రో-కో ద్వ‌యంపై అంద‌రి దృష్టి నెల‌కొని ఉంది. ఆసియా క్రీడ‌ల కోసం శ్రేయ‌స్ అయ్య‌ర్ నేతృత్వంలో ఒక బృందం ఇప్ప‌టికే జ‌పాన్‌కు చేరుకోవ‌డంతో జ‌ట్టులో మార్పులు అనివార్య‌మ‌య్యాయి. అకిబ్ న‌బీ, న‌మ‌న్ ధిర్‌ల‌ను విండీస్‌తో వ‌న్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇక  మరో సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా కూడా ఆరు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ వ‌న్డే మ్యాచ్ ఆడ‌నుండ‌డం విశేషం.

మ‌రోవైపు ఆసియా క్రీడ‌ల్లో ఆడేందుకు ఇప్ప‌టికే శ్రేయ‌స్ అయ్య‌ర్ టీం జ‌పాన్‌లో అడుగుపెట్టింది. జ‌పాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్ ఆడి అతిక‌ష్టం మీద గెలిచిన టీమిండియా ఇప్పుడు ఆసియా క్రీడ‌ల్లో వ‌రుస‌గా రెండో స్వ‌ర్ణం గెల‌వాల‌ని ఆశిస్తోంది. కానీ జ‌పాన్‌తో ఆడిన మ్యాచ్‌లో 5 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైన‌ప్ప‌టికీ, పిచ్ మాత్రం భార‌త్‌కు అనుకూలంగా లేద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. దీంతో ఈసారి భార‌త్‌కు స్వ‌ర్ణం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

ఇదీ చదవండి: ‘అంతా తొండి.. అందుకే కరచాలనం చేయలేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement