Photo Credit: Twitter
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్-2026)లో ఫిక్సింగ్ కలకలం రేగింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఆటగాడు వంశ్ బేడీ స్పాట్ ఫిక్సింగ్ ఉచ్చులో చిక్కుకున్నట్లు సమాచారం. అయితే బేడీ ఈ విషయాన్ని వెంటనే యాంటీ కరప్షన్ వింగ్ దృష్టికి తీసుకెళ్లడంతో విషయంలో వెలుగులోకి వచ్చింది.
తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను వంశ్ బేడీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఖండించాడు. ‘‘నేను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు సోషల్ మీడియాతో పాటు కొన్ని వెబ్‌సైట్లు నా పరువుకు భంగం కలిగించే విధంగా తప్పుడు కథనాలు రాశాయి. సీఎస్‌కే ఆటగాడికి సంబంధించిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై తెహెల్కా స్టింగ్ ఆపరేషన్‌లో మాజీ రంజీ క్రికెటర్ రచిత్ భాటియా ప్రస్తావించిన వ్యక్తి నేను కాదని, ఆ ఫిక్సింగ్ కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
అనవసరంగా నాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నా. దీనికి బాధ్యులైన వారిపై నా న్యాయ బృందం తగిన సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోనుంది. అటువంటి తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను సృష్టించడం లేదా పంచుకోవడం మానుకోవాలని ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు.
ఇదే విషయమై డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఆటగాడు బేడీని సంప్రదించినట్లు సమాచారం. ఆ ఆటగాడు అక్కడే ఓ టీ20 లీగ్ లో కూడా ఆడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై డీడీసీఏ ఇప్పుడు బీసీసీఐని ఆశ్రయించింది. తదుపరి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై బీసీసీఐ సలహా కోరింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ లేఖ రాసినట్లు డీడీసీఏ తెలిపింది. బీసీసీఐ మార్గదర్శకత్వం కోసం వేచి చూస్తున్నట్లు అశోక్ శర్మ వెల్లడించారు.
ఇక ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ చేతిలో ఓడింది. వంశ్ బేడీ గతంలో పురాణి ఢిల్లీ 6 తరఫున కూడా ఆడాడు. అతనికి ఐపీఎల్లో చెన్నె సూపర్ కింగ్స్ కూడా అవకాశం లభించింది.
ఇదీ చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన


