విల్ జాక్స్ అరుదైన ఫీట్‌.. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన లంక | Will Jacks 5 Wickets-46 Runs Not-out-ENG Beat SL-89 Runs-1st ODI | Sakshi
Sakshi News home page

విల్ జాక్స్ అరుదైన ఫీట్‌.. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన లంక

Sep 23 2026 6:57 AM | Updated on Sep 23 2026 7:09 AM

Will Jacks 5 Wickets-46 Runs Not-out-ENG Beat SL-89 Runs-1st ODI

Photo Credit: Twitter

చెస్ట‌ర్-లీ-స్ట్రీట్ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఇంగ్లండ్ 89 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. విల్ జాక్స్ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న (46 నాటౌట్‌, 5/22) చేసి జ‌ట్టు విజయంలో కీల‌క‌పాత్ర పోషించాడు. త‌ద్వారా విల్‌జాక్స్ అరుదైన ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ త‌ర‌ఫున వ‌న్డేల్లో ఐదు వికెట్లు తీయ‌డంతో పాటు 40కి పైగా ప‌రుగులు చేసిన నాలుగో ఆట‌గాడిగా విల్ జాక్స్ నిలిచాడు. 

గ‌తంలో గ్రేమీ హిక్ (జింబాబ్వేపై 5/33 & 80, 2000లో), రోనీ ఇరానీ (భార‌త్‌పై 5/26 & 53, 2002లో), పాల్ కొలింగ్‌వుడ్ (బంగ్లాదేశ్‌పై 6/31 & 112*, 2005లో) విల్ జాక్స్ కంటే ముందున్నారు. ఇక శ్రీలంక‌తో వ‌న్డేల్లో చూసుకుంటే ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేసిన ఆరో ఇంగ్లండ్ బౌల‌ర్‌గా విల్‌జాక్స్ నిలిచాడు. గ‌తంలో క్రిస్ వోక్స్ (6-47), క్రిస్ జోర్డాన్ (5-29), మార్క్ ఎల్హ‌మ్ (5-32), విక్ మార్క్స్ (5-39), సామ్ క‌ర‌న్ (5-48) ఈ ఫీట్ సాధించారు.

మ్యాచ్ విష‌యానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 48.1 ఓవ‌ర్ల‌లో 265 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (67) అర్థ‌సెంచ‌రీ చేయ‌గా, విల్ జాక్స్ (46 నాటౌట్‌), జో రూట్ (44) రాణించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో స‌చిందు, అసితా ఫెర్నాండో చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం బ్యాటింగ్ చేసిన శ్రీలంక జ‌ట్టు 37 ఓవ‌ర్ల‌లో 176 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దునిత్ వెల్ల‌లాగె (45), కుసాల్ మెండిస్ (42) మిన‌హా మిగ‌తావాళ్లు విఫ‌ల‌మ‌య్యారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో విల్ జాక్స్ 5 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, జేమీ ఓవ‌ర్ట‌న్ 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన విల్ జాక్స్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే రేపు లీడ్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

ఇదీ చదవండి: డెబ్యూ మ్యాచ్‌లో అద‌ర‌గొట్టిన‌ లంక బౌల‌ర్‌.. ఇంగ్లండ్ ఆలౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement