Photo Credit: Twitter
ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన భారత మహిళల క్రికెట్ జట్టును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందించారు. ఈ మేరకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘ఆసియా గేమ్స్-2026 లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్ అంతటా జట్టు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశానికి గర్వకారణం.
ఈ అద్భుత విజయానికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు, జట్టులోని ప్రతి క్రీడాకారిణికి అభినందనలు. జట్టు విజయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి పోషించిన పాత్రను గుర్తించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆమె విజయ ప్రస్థానం మన రాష్ట్రంలోని యువతులకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను.’’ అని చెప్పుకొచ్చారు.
మహిళల క్రికెట్ పోటీల విజేతగా భారత్ నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, శ్రీచరణి, శ్రేయాంక, షఫాలీ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
My heartiest congratulations to the Indian women’s cricket team on winning the gold medal at the #AsianGames2026. The team’s dominant performance throughout has made the entire nation proud. Congratulations to captain Harmanpreet Kaur and every player of the team for this… pic.twitter.com/FSjiOZjNs7
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 22, 2026
ఇదీ చదవండి: వరుస విజయాలు.. దుమ్ములేపుతున్న భారత హాకీ జట్లు


