సాక్షి, తాడేపల్లి: రేపు(బుధవారం) సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలవనున్నారు. శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి ఘటనపై వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని వైఎస్ జగన్ కోరనున్నారు.
పార్టీ నాయకులతో ఇవాళ(మంగళవారం) వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. నిన్నటి వైఎస్సార్‌సీపీ శాంతియుత ర్యాలీలపై టీడీపీ గూండాల దాడిపై చర్చించారు. చంద్రబాబు, లోకేష్‌ల పథకానికి కొంతమంది పోలీసులు కొమ్ముకాశారని పార్టీ నాయకులు వైఎస్ జగన్‌కు వివరించారు. ఈ దాడి ఘటనను పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందన్న వైఎస్ జగన్.. ఈ వ్యవహారాన్ని గవర్నర్‌కు కలిసి వివరించాలని నిర్ణయించారు.
డీఎస్సీ స్కాంలో చంద్రబాబు, లోకేష్‌లు అడ్డంగా దొరికారని.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. స్కామ్‌లను బయటపెడుతుంటే దాడులు చేస్తున్నారు. నిన్న(సోమవారం) వైఎస్సార్‌సీపీ చేసిన ర్యాలీ కార్యక్రమంతో డీఎస్సీ స్కాంపై మరోసారి చర్చ జరిగింది.. దీన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు, లోకేష్‌లు గూండాలను దింపారని వైఎస్ జగన్ అన్నారు.
ఇదీ చదవండి: రౌడీ దళాన్ని దించినా డీఎస్సీపై పోరు ఆగదు


