సాంబారు గిన్నెలో పడి మహిళ మృతి | Tragedy at Annadana Program | Sakshi
Sakshi News home page

సాంబారు గిన్నెలో పడి మహిళ మృతి

Sep 22 2026 11:15 AM | Updated on Sep 22 2026 11:18 AM

Tragedy at Annadana Program

చిట్టినగర్‌(విజయవాడ): పొయ్యి నుంచి కిందకు దింపుతున్న సాంబారు గిన్నెలో ప్రమాదవశాత్తు పడిన మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఘటనపై మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భీమనవారిపేటకు చెందిన మద్ది సుజాత వంట పని చేస్తుంటుంది. భర్త శ్రీనివాసరావుతో విభేదాల కారణంగా ఇద్దరు మగ పిల్లలతో విడిగా ఉంటోంది. 

సుజాత ఆదివారం కేఎల్‌రావు నగర్‌ 5వ లైన్‌లో వినాయకుడి పందిరి వద్ద అన్నదాన కార్యక్రమానికి వంట చేసేందుకు వెళ్లింది. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో సాంబారు గిన్నెను పొయ్యిపై నుంచి కిందకు దింపే క్రమంలో ముందుకు పడిపోయింది. దీంతో సుజాతకు తీవ్రగాయాలు కాగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. పెద్ద కుమారుడు మహేష్‌ నాగకుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.   

 

ఇదీ చదవండి: స్కూటీ అదుపుతప్పి లోయలోపడ్డ యువతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement