తన యజమాని కారులో ఉంచిన రూ.2 కోట్ల సొమ్ముతో డ్రైవర్ పరారైన సంఘటనపై స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఆర్‌వీ నగర్‌కు చెంది కందుల సురేష్ కుమార్ కేపీకే బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇండస్ట్రీ నిర్వహిస్తున్నాడు.
అతను బ్యాంకులో రూ.2 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంది. ఆ విషయాన్ని డ్రైవర్ పండూరి సాయిశివ అనే వ్యక్తికి ఆదివారం చెప్పాడు. మర్నాడు ఉదయం సురేష్‌కుమార్ చెప్పిన విధంగానే రూ.2 కోట్లు కారులో పెట్టుకున్నాడు. జిమ్‌కి వెళ్లి తర్వాత బ్యాంకుకు వెళ్లి సొమ్ము డిపాజిట్ చేద్దామనుకున్నాడు. సొమ్ము కారులో వదిలి జిమ్‌కి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి డ్రైవర్ సాయిశివ కనిపించలేదు. కారులో నగదు బ్యాగు అదృశ్యమైంది. దీంతో సురేష్‌కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కంబాలచెరువు (రాజమహేంద్రవరం):


