సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. శాప్ ఆఫీస్ వద్ద డీఎస్సీ అక్రమాలపై నిరసన చేసినందుకు కేసులు నమోదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసు నమోదైంది. ఆయనతో పాటు మురళి, ఫాతిమా, డైమండ్ బాబుపై అక్రమ కేసులు నమోదు చేశారు.
విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేతలపై మాచవరం స్టేషన్‌లో పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రేసిడెంట్ రవిచంద్ర, వైసీపీ నేత సుందరపాల్‌ను అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి చేయగా.. టీడీపీ గూండాలను వదిలి వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టారు. శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ శాంతియుత నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ గూండాలు.. పోలీసుల చేతిలో ఉన్నా లాఠీలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేశారు.


