వైఎస్సార్‌సీపీ మహిళా నేత మంజరి చౌదరి అరెస్ట్‌కు యత్నం | Police Attempt To Arrest Tenali Ysrcp Woman President Manjari Chaudhary | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మహిళా నేత మంజరి చౌదరి అరెస్ట్‌కు యత్నం

Sep 22 2026 7:47 AM | Updated on Sep 22 2026 8:05 AM

Police Attempt To Arrest Tenali Ysrcp Woman President Manjari Chaudhary

సాక్షి, గుంటూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తెనాలిలో అర్ధరాత్రి మాచవరం పోలీసుల హడావుడి చేశారు. తెనాలి వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు మంజరి చౌదరి అరెస్ట్‌కు యత్నించారు. ఎస్‌ఏఏపీ ఆఫీస్‌ ముందు ధర్నాలో పాల్గొన్నందుకు అక్రమ కేసు బనాయించారు. మంజరిని అరెస్ట్‌ చేసేందుకు అర్ధరాత్రి పోలీసులు ఆమె ఇంటికెళ్లారు, నోటీస్‌ ఇవ్వకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ ప్రశ్నించింది. దీంతో మాచవరం పోలీసులు వెనక్కి తగ్గారు.

వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు..
విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేతలపై మాచవరం స్టేషన్‌లో పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రేసిడెంట్ రవిచంద్ర, వైసీపీ నేత సుందరపాల్‌ను అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి చేయగా..  టీడీపీ గూండాలను వదిలి వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టారు. శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ శాంతియుత నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ గూండాలు.. పోలీసుల చేతిలో ఉన్నా లాఠీలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేశారు. మరికొంత మందిని అరెస్ట్ చేయడానికి మాచవరం పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి: మీకు మీరే సర్టీఫికెట్‌ ఇచ్చుకుంటారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement