ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. దూసుకొస్తున్న వాయుగుండం.. | Heavy Rains In Andhra Pradesh On September 22 To 24 | Sakshi
Sakshi News home page

ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. దూసుకొస్తున్న వాయుగుండం..

Sep 22 2026 7:11 AM | Updated on Sep 22 2026 7:18 AM

Heavy Rains In Andhra Pradesh On September 22 To 24

సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వా­యు­గుండంగా మారినట్లు వాతా­వరణ శాఖ తెలిపింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఇది విశాఖ–గోపాలపూర్‌ మధ్య రేపు(బుధవారం) రాత్రి నుంచి ఎల్లుండి (గురువారం) తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. నేడు ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.

heavy rains in andhra pradesh updates9

పూరీకి 310 కి.మీ, కళింగపట్నంకు 390 కి.మీ, విశాఖకు 470 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో 23, 24 తేదీల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో 23న కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఆరెంజ్‌ అలెర్ట్‌ ఇచ్చారు. 24న కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.. అల్లూరి, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

heavy rains in andhra pradesh updates12

సముద్ర వాతావరణం అత్యంత అలజడిగా మారింది. ఐదురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, సోమవారం కాకినాడ జిల్లా శంఖవరంలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఇదీ చదవండి: మీకు మీరే సర్టీఫికెట్‌ ఇచ్చుకుంటారా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement