ఫారిన్ ఫ్రెండ్స్‌తో లగ్జరీ హోటల్‌కి వెళ్లిన ప్రముఖ కార్డియాలజిస్ట్
మాతో పాటూ బొద్దింక కూడా.. దెబ్బకి పరువుపోయింది
ఆకలి చచ్చిపోయింది- ప్రముఖ కార్డియాలజిస్ట్ వ్యాఖ్యల సంచలనం
మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారాం ముండే (Tukaram Mundhe) ఇటీవలి కాలంలో హోటళ్లు, పరిశుభ్రత అంటూ నిబంధనలను పాటించని రెస్టారెంట్లపై కొరాడా ఝళిపిస్తున్నారు. అదిరింపులు, బెదిరింపులకు ఏమాత్రం వెరవకుండా చిన్న, చిన్న హోటళ్లనుంచి విలావంతమైన రెస్టారెంట్ల వరకు ఫుడ్ సేఫ్టీ పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ సేథ్, ఆదివారం (సెప్టెంబర్ 20) సాయంత్రం ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ వ్యవహారంపై ఆయన వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి.
ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఛైర్మన్, హృద్రోగ నిపుణుడైన డా. సేథ్ డిన్నర్ కోసం హోటల్ కెళ్లారు. ఇంతలో ఆయన టేబుల్‌పై ఉన్న ఒక చిన్న బొద్దింక దర్శన మిచ్చింది. దీంతో అక్కడ పాటిస్తున్న ఫుడ్ సేఫ్టీపై వ్యంగ్యంగా రాసుకొచ్చారు. జేడబ్ల్యూ మారియట్ (JW Marriott) హోటల్‌పై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఆ హోటల్ రెస్టారెంట్‌లో , విదేశీ ప్రతినిధులతో కలిసి భోజనం చేస్తుండగా, డైనింగ్ టేబుల్‌పై బొద్దింక కనిపించడం తీవ్ర పరిశుభ్రతా లోపాలకు అద్దం పడుతోందని ఆయన మండిపడ్డారు.
ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం : ఇండిగో ఉద్యోగిని దుర్మరణం
Look who came for dinner unexpectedly. ‘Roachie’ - a baby *cockroach was on our table wanting to share our dinner at the Romano restaurant at JW Marriott , Sahar , Mumbai, Saturday night*!!! Despite our persuasion ‘ Roachie’ refused to leave . Maybe wanted Piazza and not… pic.twitter.com/w1h92KZiaU
— Dr. Ashok Seth (@Dr_AshokSeth) September 20, 2026
విలాసవంతమైన హోటల్‌లో ‘రోచీ’
ఆ బొద్దింకకు రోచీ అని పేరు పెట్టారు. అనూహ్యంగా రాత్రి భోజనానికి ఎవరు వచ్చారో చూడండి. ‘ రోచీ’- ఒక చిన్న బొద్దింక, శనివారం రాత్రి ముంబైలోని సహార్‌లో ఉన్న జేడబ్ల్యూ మారియట్‌లోని రొమానో రెస్టారెంట్‌లో మాతో పాటు భోజనం చేయాలని చూస్తూ మా టేబుల్ మీదకు వచ్చింది!!!” అని ఆయన ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాదు తాము ఎంత నచ్చజెప్పినా, అది అక్కడినుంచి వెళ్ళడానికి నిరాకరించిందని బహుశా దానికి పాస్తా కాకుండా పిజ్జా కావాలేమో అంటూ వ్యంగ్య బాణాలు సంధించారు. ఈ పరిణామాన్ని చూసి ఆకలి చచ్చిపోయిందని, భోజనం పూర్తి చేయకుండానే తాము అక్కడి నుంచి వచ్చేశామని తెలిపారు. విదేశీ అతిథుల ముందు ఇది దేశానికి అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారాం ముండేని ట్యాగ్ చేస్తే ఈ విషయంపై దృష్టి సారిస్తారని ఆశిస్తున్నట్లు డాక్టర్ సేథ్ పేర్కొన్నారు. మరి దీనికిమీద ముండే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇదీ చదవండి: సీనియర్ నటి కన్నుమూత, ప్రముఖుల సంతాపం


