తమ ఆస్తులపై చేస్తున్న ఆరోపణలకు సిట్టింగ్ విచారణకు సవాల్ విసిరామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయినప్పటికీ సీఎం రేవంత్ ఇప్పటి వరకూ స్పందించలేదని తెలిపారు. సిరిసిల్ల ప్రజలకు రేవంత్ ముఖం ఏలా చూపిస్తారని తమపై చేసిన ఆరోపణలకు సీఎం క్షమాపణలు చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని దీనికై రాజన్నను దర్శించుకొని పాప ప్రక్షాళన చేసుకోవాలని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న డ్రామాలు ఆపాలని వారిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు.


