అయోధ్య విరాళాల గోల్‌మాల్‌, సిట్‌ సంచలన నివేదిక | Ram Temple Donation Theft Caught On CCTV 105 Times Probe Report | Sakshi
Sakshi News home page

అయోధ్య విరాళాల గోల్‌మాల్‌, సిట్‌ సంచలన నివేదిక

Sep 21 2026 6:09 PM | Updated on Sep 21 2026 6:14 PM

Ram Temple Donation Theft Caught On CCTV 105 Times Probe Report

అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీకి సంబంధించిన కేసు విచారణలో భాగంగా సంచలన విషయాలు సుప్రీంకోర్టు ముందు నిలిచాయి. విరాళాల చోరీ ఘటనలపై విచారణ జరుపుతున్న ఎస్‌ఐటీ  ((SIT) దర్యాప్తు తుది దశకు చేరుకుందని, సెప్టెంబర్ 25 నాటికి ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.  ఈ సందర్భంగా సిట్‌ దర్యాప్తులో కీలక విషయాలను సుప్రీం ముందుంచారు. ఛార్జిషీట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టు మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది.

రామ మందిరంలో విరాళాల దొంగతనానికి సంబంధించిన నూట ఐదు ఘటనలు ఆలయ సీసీటీవీలో నమోద య్యాయని సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. మొత్తం 105 సార్లు విరాళాల చోరీ సంఘటనలు రికార్డైనట్లు  తెలిపింది.  ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఎనిమిది మంది నిందితులతో పాటు ఇతరులను కూడా అరెస్ట్ చేసినట్లు కోర్టుకు నివేదించారు.

ఆరోపిత విరాళాల దొంగతనానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సిట్‌ స్టేటస్ రిపోర్టును సమీక్షించింది. విచారణ సందర్భంగా, ఇప్పటివరకు జరిగిన అరెస్టుల సంఖ్య, విరాళాల దొంగతనానికి సంబంధించి సేకరించిన సాక్ష్యాధారాల గురించి కోర్టుకు తెలియజేశారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాధారాలకు సంబంధించిన వివరాలను కూడా పంచుకున్నారు. 

మరోవైపు ఎస్‌ఐటీ నివేదిక కాపీని ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, సుప్రీంకోర్టు  తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ఈ విషయాన్ని సెషన్స్ జడ్జి చేతుల నుండి బయటకు తీసుకెళ్లడానికి తాము ఇష్టపడటం లేదని, తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తేనే ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది.చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేజిస్ట్రేట్‌ను కోర్టు ఆదేశించింది. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్, ఇతర సామాగ్రిని ఎలా విశ్లేషించారో స్టేటస్ రిపోర్టులో వివరించారు. ఇచ్చిన సమాచారం మొత్తాన్ని సుప్రీంకోర్టు రికార్డులోకి తీసుకుంది. 

ఇదీ చదవండి: సీనియర్‌ నటి కన్నుమూత, ప్రముఖుల సంతాపం

 కాగా ఈ వివాదం వెలుగులోకి రావడంతో రామమందిర ట్రస్ట్ ప్రముఖులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను వారి పదవుల నుండి తొలగించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ముందే, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 13న లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసింది.ఈ కమిటీ జూన్ 23న రాష్ట్ర ప్రభుత్వానికి తన ప్రాథమిక నివేదికను సమర్పించి, అనేక కఠినమైన సిఫార్సులను చేసింది.

ఎఫ్ఐఆర్‌లో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను అనే ఎనిమిది మందితో పాటు ఇతర గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు. వారందరినీ అరెస్టు చేసి,  కేసులు నమోదు చేశారు. కాగా మాజీ సైనికాధికారి జితేంద్ర మిశ్రాను కొత్త  రామ మందిర ట్రస్ట్‌ సీఈవోగా నియమించిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: లగ్జరీ హోటల్‌లో ‘ ‘రోచీ’: పరువుపోయింది, తుకారం ముండే కాస్త చూస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement