సోనియా గాంధీకి ఎదురుదెబ్బ | Sonia Gandhi Voter List Case: Delhi Court Orders Re-examination | Sakshi
Sakshi News home page

సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

Sep 21 2026 5:44 PM | Updated on Sep 21 2026 6:00 PM

Sonia Gandhi Voter List Case: Delhi Court Orders Re-examination

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించి ఓ పాత కేసులో ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. భారత పౌరసత్వం పొందకముందే ఓటరు జాబితాలో ఆమె పేరు చేర్చారనే ఫిర్యాదును తోసివేస్తూ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ ప్రత్యేక కోర్టు (సెషన్స్ కోర్టు) రద్దు చేసింది. ఈ కేసుకు సంబంధించి తగిన కారణాలతో కూడిన ఉత్తర్వులు ఇవ్వాలని మెజిస్ట్రేట్ కోర్టును ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఆదేశించారు.

సోనియా గాంధీకి 1983లో భారతీయ పౌరసత్వం రాగా, అంతకంటే ముందే అంటే 1980 నాటి ఓటరు జాబితాలో ఆమె పేరును చేర్చారంటూ న్యాయవాది వికాస్ త్రిపాఠి గతంలో మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. అయితే, ఎలాంటి పోలీసుల స్టేటస్ రిపోర్టు కోరకుండా, సరైన కారణాలు చూపకుండానే మెజిస్ట్రేట్ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసిందని సెషన్స్ కోర్టు తప్పుపట్టింది.

పోలీసుల నుంచి నివేదిక కోరకుండా, చట్టపరమైన నిబంధనలను పరిశీలించకుండా మెజిస్ట్రేట్ కోర్టు తొందరపాటుగా వ్యవహరించిందని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను తిరిగి పరిశీలించి, కొత్త వాదనలు విన్న తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేయాలని మెజిస్ట్రేట్ కోర్టును ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి సెషన్స్ కోర్టు వాయిదా వేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement