breaking news
Special Inspection Team
-
అయోధ్య స్కాం.. ట్రస్ట్ నగదు నిల్వలపై స్పెషల్ ఫోకస్
లక్నో: అయోధ్య ఆలయ ట్రస్ట్ విరాళాల కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలు, విరాళాల లెక్కింపు విధానం, నిర్మాణ పనుల వ్యయంపై సమగ్ర ఆడిట్‌కు అధికారులు సిద్ధమయ్యారు. అలాగే, సిట్ అధికారులు గత ఐదేళ్ల ఖాతాలపై రీ-ఆడిట్ చేయనున్నారు.వివరాల ప్రకారం.. అయోధ్య ట్రస్ట్‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, నగదు, విరాళాల స్వీకరణ, ఖర్చుల వివరాలను సిట్ రీ-ఆడిట్ చేయిస్తోంది. పెద్ద మొత్తంలో వచ్చిన విరాళాలు ఎలా వినియోగించబడ్డాయి, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఉందా లేదా అనే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సిట్ అధికారులు ముఖ్యంగా.. గత ఐదేళ్ల ట్రస్ట్ ఖాతాలపై ఫోకస్ చేసింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన విరాళాలు ఏ రూపంలో వచ్చాయి (నగదు, బ్యాంక్ ట్రాన్స్ఫర్, డొనేషన్ బాక్స్‌లు) అనే అంశాలను వర్గీకరించి పరిశీలిస్తున్నారు. అలాగే, పెద్ద మొత్తంలో వచ్చిన విరాళాల నమోదు ప్రక్రియ, అకౌంటింగ్ పద్ధతులు, ఆడిట్ రిపోర్టులు సమర్థంగా నిర్వహించబడ్డాయా లేదా అన్నది కూడా దర్యాప్తులో భాగంగా ఉంది.నిర్మాణ వ్యయాలపై ప్రత్యేక తనిఖీలుఅయోధ్యలో కొనసాగుతున్న రామ మందిర నిర్మాణ పనులకు సంబంధించిన ఖర్చులపై కూడా సిట్ మరోసారి విచారణను ప్రారంభించనుంది. కాంట్రాక్టులు ఎలా కేటాయించబడ్డాయి, నిర్మాణ సామగ్రి కొనుగోలు ప్రక్రియ, చెల్లింపుల వ్యవస్థ.. ఈ అంశాలన్నింటిపై అధికారులు డేటా సేకరిస్తున్నారు. కొన్ని కాంట్రాక్టులపై వివరణ కోరే అవకాశం ఉందని సమాచారం. విరాళాలు లెక్కించే విధానం, డొనేషన్ బాక్సుల నిర్వహణ, వాటి ఓపెనింగ్ విధానం వంటి అంశాలపై కూడా సిట్ దృష్టి పెట్టింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విరాళాలు కేంద్ర ట్రస్ట్ ఖాతాలకు ఎలా జమయ్యాయి, వాటి రికార్డింగ్‌లో లోపాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. అలాగే, ట్రస్ట్ వద్ద ఉన్న నగదు నిల్వలు, వాటి నిర్వహణ, బ్యాంక్ డిపాజిట్లు, వడ్డీ ఆదాయం వంటి అంశాలను కూడా సిట్ పరిశీలిస్తోంది. భారీ మొత్తంలో నగదు నిల్వలు ఎలా నిర్వహించబడ్డాయి అన్నది కీలక అంశంగా మారింది.సమగ్ర నివేదిక సిద్ధం దిశగా.. మొత్తం ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర నివేదిక తయారు చేయడానికి సిట్ పని ప్రారంభించింది. అవసరమైతే ట్రస్ట్ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, అయోధ్య ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై జరుగుతున్న ఈ దర్యాప్తు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో తనకు సిట్ విచారణపై నమ్మకం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టింది తానే అని సంజయ్ చెప్పుకొచ్చారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేంద్రమంత్రి బండి సంబయ్ బయలుదేరారు. ఈ సందర్బంగా బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నన్ను విచారణకు పిలిచారు.. వెళ్తున్నాను. నా దగ్గరున్న సమాచారాన్ని సిట్‌కు అందజేస్తాను. బాధ్యత గల పౌరుడిగా నేను వెళుతున్నాను. సిట్ విచారణపై నాకు నమ్మకం లేదు. ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టింది నేనే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి క్షణం నా ఫోన్ ట్యాప్ చేశారు. ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే నన్ను దెబ్బతీయాలని అనేక కుట్రలు చేశారు. మిగిలిన విషయాలు సిట్ విచారణ అనంతరం మాట్లాడతాను’ అని తెలిపారు.మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక, బీజేపీ ఈ వ్యవహారాన్ని.. జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది. కేంద్ర నిఘా వర్గాల నుండి కీలక సమాచారాన్ని కూడా బండి సంజయ్ సేకరించినట్టు తెలుస్తోంది. నిఘా వర్గాలు సైతం సంజయ్ ఫోన్‌ను అత్యధికంగా ట్యాప్ చేసినట్టు నిర్ధారించారని సమాచారం. ఇక, ఈరోజు బండి సంజయ్‌తో పాటుగా.. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్వో పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ విచారణకు హాజరు కానున్నారు. -
సిట్ కార్యాలయానికి ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి పాలనలో వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. తాజాగా మద్యం కేసులో విచారణ పేరుతో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విషయంలో కుట్రపూరిత్తంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే నేడు సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో మిథున్ రెడ్డి.. సీపీ కార్యాలయానికి చేరుకున్నారు.మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, అధికారులను, ఉద్యోగులను వేధించి పోలీసులు తప్పుడు వాంగ్మూలాలు నమోదుచేశారు. సిట్ అధికారులు వేధిస్తున్నారని వాసుదేవరెడ్డి ఇప్పటికే మూడు సార్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ విచారణకు రావాలని మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం విజయవాడలోని సీపీ కార్యాలయానికి మిథున్ రెడ్డి చేరుకున్నారు. విచారణకు మిథున్ రెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. -
బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో యాప్స్‌పై విచారణ జరిపేందుకు సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్ నియామకం అయ్యారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహరాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే యాప్స్ కేసులను విచారించేందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్ నియామకం అయ్యారు. అలాగే, సిట్ సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్ ఉన్నారు. ఇక, సిట్.. 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పంజాగుట్ట, మియాపూర్‌లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులను సిట్‌కు బదిలీ చేశారు. #SayNoToBettingApps pic.twitter.com/jPRzks6PqV— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2025 ప్రిడిక్షన్ పేరుతో బెట్టింగ్ ఉబిలోకి.. జాగ్రత్త!!ఐపీఎల్ మ్యాచ్ ల ప్రిడిక్షన్ పేరుతో కొందరు కొత్త దందా. టెలిగ్రాం ఛానెల్ లో జాయిన్ కావాలంటూ యువతను బెట్టింగ్ కు బానిసలను చేస్తున్న వైనం.ఐపీఎల్ ను ఎంజాయ్ చేయండి. అంతేకానీ ఇలాంటి మాయగళ్ల మాటలు విని మీ జేబులు గుల్ల చేసుకోకండి. pic.twitter.com/XfO1BObmgD— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 30, 2025 -
కమిషనర్ ఆదేశాలిస్తారు.. డీఐజీలు పాతరేస్తారు!
► ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలను నివారించేందుకు తనిఖీలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) అధికారులకు హుకూం జారీ చేస్తారు. ఈ మేరకు ప్రత్యేక ఆడిట్ టీమ్‌లను ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ కిందిస్థాయి అధికారులకు ఆదేశాలిస్తారు. కమిషనర్ ఆదేశాలి చ్చినా ప్రత్యేక ఆడిట్ టీమ్‌ల ఏర్పాటుకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ) స్థాయి అధికారులు మోకాలడ్డుతారు. రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతున్న తంతు ఇదే. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వెసులుబాటుతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాల్లోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా నడుస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో, ఏడాదిగా ఆడిట్ జరగని రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల్లోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టాలని కమిషనర్ నిర్ణయించారు. ముగ్గు రు (రంగారెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్) ఆడిట్ రిజిస్ట్రార్లతో ప్రత్యేక ఆడిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ గత ఫిబ్రవరి 6న ఉత్తర్వులు కూడా జారీచేశారు. జూన్ 2లోగా తనిఖీలను పూర్తి చేయాలని కూడా నిర్దేశం చేశారు. కమిషనర్ ఆదే శాల కాపీలు సదరు ఆడిట్ బృందంలోని సభ్యులకు చేరే వారం లోగానే, తనిఖీ లకు బృందం ఆవశ్యకతలేదని ప్రత్యేక ఆడిట్ టీమ్‌ను రద్దు చేశామని డీఐజీలలో ఒకరు టీమ్ సభ్యులకు తెలిపారు. తనిఖీలు కొనసాగితే తమ బండారాలు ఎక్కడ బయట పడతాయోనని భయపడిన కొందరు ఆడిట్ టీమ్‌ను రద్దు చేయించుకు న్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనర్ ఆదేశాల మేరకు ఆడిట్ టీమ్ తనిఖీలు నిలిచిపోవడంతో.. కూకట్పల్లి, బాలానగర్, ఎల్బీనగర్ కార్యాల యా ల్లో జరిగిన అవకతవకలపై సీఎం కార్యాలయమే నేరుగా దృష్టి సారించింది.


