
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి పాలనలో వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. తాజాగా మద్యం కేసులో విచారణ పేరుతో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విషయంలో కుట్రపూరిత్తంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే నేడు సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో మిథున్ రెడ్డి.. సీపీ కార్యాలయానికి చేరుకున్నారు.
మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, అధికారులను, ఉద్యోగులను వేధించి పోలీసులు తప్పుడు వాంగ్మూలాలు నమోదుచేశారు. సిట్ అధికారులు వేధిస్తున్నారని వాసుదేవరెడ్డి ఇప్పటికే మూడు సార్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ విచారణకు రావాలని మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం విజయవాడలోని సీపీ కార్యాలయానికి మిథున్ రెడ్డి చేరుకున్నారు. విచారణకు మిథున్ రెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాదులు హాజరయ్యారు.
