సింగరాయకొండ: ప్రకాశం జిల్లా పాకల సముద్ర తీరంలో ఆదివారం పాకల పంచాయతీలోని చెల్లెమ్మగారి పట్టపుపాలేనికి చెందిన మత్స్యకారుడు కఠారి కృష్ణంరాజు వలకు భారీ సొరచేప పడింది. ఉదయం సముద్రంలో 15 కిలోమీటర్ల దూరం వెళ్లి వేట సాగించాడు. ఆ సమయంలో సొరచేప వలకు చిక్కింది. ఇది తల్లి చేప అని, పిల్లల్ని కనేదశలో ఉందని మత్స్యకారులు తెలిపారు.
ఈ సొరచేప రింగు వలకు చిక్కుకోవటంతో అది మృతి చెందిందని, దీని బరువు 400 కేజీలు ఉంటుందన్నారు. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.2 లక్షలు ఉంటుందని మత్స్యశాఖాధికారులు తెలిపారు. ఈ చేప గర్భంలో దాదాపు 30 వరకు పిల్ల సొరచేపలు లభించాయని తెలిపారు. ఈ చేపను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మత్స్యకారుడు శివ రూ.8 వేలకు ఈ చేపను దక్కించుకున్నాడు.


