అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్‌ ఆగ్రహం | Ap Council Chairman Agreed On Atchannaidu Comments | Sakshi
Sakshi News home page

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్‌ ఆగ్రహం

Mar 4 2026 3:28 PM | Updated on Mar 4 2026 4:03 PM

Ap Council Chairman Agreed On Atchannaidu Comments

సాక్షి, అమరావతి: మండలి  ఛైర్మన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మండలి ఛైర్మన్‌ను క్రిస్టియన్‌ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను క్రిస్టియన్‌  అనడానికి నువ్వు  ఎవరు?’’ అంటూ మండిపడ్డ మండలి ఛైర్మన్‌.. తాను క్రిస్టియన్‌ కాదని స్పష్టం చేశారు. తాను హిందువునని.. క్రిస్టియన్‌ కాదని మండలి ఛైర్మన్‌ తెలిపారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు  క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. 

బాబూ.. మీ మంత్రులకు ఇదేనా నేర్పింది?: బొమ్మి ఇజ్రాయెల్‌
శాసనమండలి మీడియా పాయింట్‌లో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాట్లాడుతూ.. కులాల మధ్య కుంపటి పెట్టిన వ్యక్తి చంద్రబాబు  అంటూ మండిపడ్డారు. చంద్రబాబు బాటలోనే మంత్రులు నడుస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు.. ఛైర్మన్‌ను అవమానించారు. ఛైర్మన్ దళితుడనే కారణంతో ఆయన్ని అవమానించారు. మీ నాయకుడు, మీ ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ మంత్రి అవమానించారు. అయ్యా చంద్రబాబు.. మీ మంత్రులకు ఇదేనా మీరు నేర్పింది?

..దళితులు, క్రిస్టియన్ల పట్ల మీకెందుకు అంత వివక్ష. లోకేష్ సమక్షంలోనే అచ్చెన్నాయుడు మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడితో లోకేష్ ఇలా మాట్లాడించారా?. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు క్రిస్టియన్లకు క్షమాపణ చెప్పాలి. హెరిటేజ్, ఇందాపూర్, సంఘం డెయిరీలు, వైష్ణవి కంపెనీలను కాపాడుకోవడానికే మీ ప్రయత్నం. కచ్చితంగా దేవుడే మీకు బుద్ధి చెబుతాడు. తిరుమల లడ్డూపై చర్చకు రావాలని మేం వారం రోజుల నుంచి కోరుతున్నాం. చర్చకు రాకుండా పారిపోతున్నారు. ఈరోజుకి ఎట్టకేలకు చర్చకు అంగీకరించారు. చర్చకు పదే పదే మంత్రులు అడ్డుపడ్డారు’’ అంటూ  బొమ్మి ఇజ్రాయెల్‌ మండిపడ్డారు.

నువ్వు క్రిస్టియన్.. మండలి చైర్మన్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

 

Advertisement
 
Advertisement
Advertisement