అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్..
మీడియా పాయింట్:
లడ్డూపై చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రులు యత్నించారు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
- లడ్డూపై చర్చ జరపాలని మండలి మొదటి రోజు నుంచి డిమాండ్ చేస్తున్నాం
- శాసనమండలిలో లడ్డు పై చర్చ కోసం పదిరోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాం
- ఈరోజు చర్చకు ఒప్పుపుకుని నిజాలు బయట పడుతుంటే తట్టుకోలేకపోతున్నారు
- సభలో లేని వైఎస్ జగన్ గురించి మాట్లాడారు
- వైఎస్ జగన్ రాష్ట్రంలో అనేక దేవాలయాలను దర్శించారు
- నిన్నకాక మొన్న నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు
- తిరుమలకు ఏడుకొండలు ఉండాలని జీవో ఇచ్చింది వైఎస్సార్
- వైఎస్సార్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు
- వెంకటేశ్వరస్వామిపై ఎనలేని భక్తి ఉందని చంద్రబాబు చెప్పుకుంటాడు
- ఒక్కసారైనా తిరుపతిలో తలనీలాలు ఇచ్చారా?
- లడ్డూపై నిందలు వేసి చర్చకు తెచ్చింది ఎవరు?
- వైఎస్ జగన్‌కి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి
లడ్డూపై చర్చ జరగకుండా పదేపదే అడ్డుపడ్డ మంత్రులు
- టీడీపీ ఎమ్మెల్సీల తీరుపై వైఎస్సార్‌సీపీ ఆందోళన
- అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ పట్టు
- ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా
నెయ్యికి పూతపూసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా: తూమాటి మాధవరావు
- జంతు కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జ్ షీట్ 209 పేజీలో చాలా క్లియర్‌గా చెప్పింది
- 2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమల వెళ్లుంటారు కదా
- ఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
- అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారు
- మీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
- దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయటపెట్టే ధైర్యం ఉందా?
- తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారు
- టెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ మిల్క్ పౌడర్ సప్లై చేశారు
- లడ్డూపై ఆరోపణలు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు
- హెరిటేజ్ పేరు తూమాటి ప్రస్తావించగానే ఉలిక్కిపడ్డ మంత్రులు
- తూమాటి ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ మంత్రి పయ్యావుల
అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిందే..
- మండలి ఛైర్మన్‌పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు
- మీరు క్రిస్టియన్ అనుకున్నా. కానీ కాదని మీరు చెప్పారు
- క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టిన ఎమ్మెల్సీలు
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం
- మండలి ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
- తాను క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్
- తనను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరని అచ్చెన్నాయుడికి ప్రశ్న
- తాను హిందువునని క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్
- అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
- అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్
- అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: తూమాటి
- తూమాటి మాధవరావు ప్రసంగాన్ని అడ్డుకుంటున్న మంత్రులు.
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..
- 1998లో హెరిటేజ్ టీటీడీకి మిల్క్ పౌడర్ సప్లై చేసింది.
- అడిట్ డిపార్ట్‌మెంట్ పేమెంట్ ఇవ్వొద్దని ఆదేశించింది.
- అయినప్పటికీ టీటీడీ ద్వారా బిల్లు పాస్ చేసుకున్నారు
- నెయ్యికి పూత రాసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా.
- ఫిర్యాదుకు, సీబీఐ రిపోర్టుకు తేడా తెలియకుండా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు.
- జంతు కొవ్వు కలవలేదని సీబీఐ చార్జ్‌షీట్ 209 పేజీలో చాలా క్లియర్‌గా చెప్పారు.
- 2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమలకు వెళ్లుంటారు కదా.
- ఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.
- అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారు.
- మీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.
- దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయట పెట్టే ధైర్యం ఉందా?.
- తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారు.
- టెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ మిల్క్ పౌడర్ సరఫరా చేశారు.
- బిల్లులు ఆలస్యమైతే బోర్డు ముందుకు తెచ్చి మరీ బిల్లులు తెచ్చుకున్నారు.
- 2024-26 వరకు తిరుమలలో ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా?.
- మండలిలో సంచలన విషయాలను బయటపెట్టిన తూమాటి.

టీడీపీ ఎమ్మెల్సీపై చైర్మన్ ఆగ్రహం..
- టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధపై మండలి చైర్మన్ ఆగ్రహం
- సభలో వైఎస్సార్‌సీపీ నేతలను నిందితులుగా చదివిన అనురాధ
- ఈ క్రమంలో మీరు ఏమైనా.. పోలీసా, సీబీఐ అధికారా అంటూ చైర్మన్ ఆగ్రహం
మండలిలో ఉద్రిక్తత..
- ఏపీ శాసన మండలిలో అధికార పార్టీ సభ్యుల రచ్చ..
- లడ్డూపై చర్చ జరగకుండా అధికార పార్టీ సభ్యుల జులుం.
- పోడియం దగ్గర అధికార పార్టీ సభ్యుల రచ్చ.
మండలి చైర్మన్ ఆగ్రహం..
- తన మైక్ కట్ చేస్తున్నారంటూ చైర్మన్ ఆవేదన.
- మండలి ప్రతిష్ట నిలబడేలా చర్చ జరగాలన్న చైర్మన్.
- చర్చ ప్రారంభమైన 20 నిమిషాల్లో 17 సార్లు అడ్డుపడిన మంత్రులు.
- పర్వతనేని మాట్లాడుతుండగా నిమిషానికోసారి అడ్డుకున్న మంత్రులు.
- రూల్స్ మాట్లాడుతున్నామంటూనే వాస్తవాలు బయటకు రాకుండా మంత్రుల అరుపులు.
మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్‌సీపీ
- లడ్డూపై చర్చను పదేపదే అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు.
- హెరిటేజ్, ఇందాపూర్ బంధంపై చర్చకు టీడీపీ సభ్యుల అభ్యంతరం.
- వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రసంగాన్ని పదేపదే అడ్డుకుంటున్న పయ్యావుల.
- హెరిటేజ్ ప్రస్తావన రాకుండా పదేపదే అడ్డుకుంటున్న మంత్రులు.
- వాస్తవాలు బయటకు రాకుండా మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్‌సీపీ
- భోలే బాబా డెయిరీ ఎక్స్‌లెంట్ అంటూ పర్మిషన్ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే.
- అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్‌పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు.
- ఫ్లెక్సీలు వేసి దేవుడిని రోడ్డుపైకి తెచ్చారు.
- 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హెరిటేజ్ దగ్గర మజ్జిగ కొనుగోలు చేసింది.
- ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ పాల్గొనలేదని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు.
మంత్రుల అత్యుత్సాహం..
- లడ్డూపై వాస్తవాలు బయటకు రాకుండా పదేపదే మంత్రులు అడ్డుకుంటున్నారు.
- హెరిటేజ్, ఇందాపూర్ వ్యవహారం బయటకు రాకుండా మంత్రుల అడ్డగింత.
- సంఘం డెయిరీ, వైష్ణవీ డెయిరీ వ్యవహారం ప్రస్తావనకు రాగానే మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు అడ్డగింత.
లడ్డూపై మండలిలో చర్చ.. మంత్రుల ఓవరాక్షన్..
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కామెంట్స్..
- ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ యూనిట్.
- ఈ అంశంలో పెద్ద ఆర్ధిక కుట్ర దాగి ఉంది.
- ఆర్థిక కుంభకోణం బయటకు రాగానే హెరిటేజ్ వైబ్‌సైట్ నుంచి ఇందాపూర్ డెయిరీని కోమ్యానుఫ్యాక్చరింగ్‌గా మార్చేశారు.
- ప్రతీ మాట, ప్రతీ పదం ఆధారాలతోనే మాట్లాడుతున్నాను.
- కల్తీ నెయ్యి సరఫరా చేయడం వల్లే ఇందాపూర్ డెయిరీ తిరస్కరణకు గురైంది.
- టీడీపీ ప్రభుత్వంలోనే ఏఆర్ డెయిరీ నుంచి నాలుగు ట్యాంకర్లు వచ్చాయి.
- ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది.
- లడ్డూ ప్రసాదంపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
- స్వయంగా సీఎం చంద్రబాబే అబద్ధాలు చెప్పారు.
- టీడీపీ ప్రభుత్వంలో కల్తీ జరిగితే వైఎస్సార్సీపీకి అంటగట్టాలని చేస్తున్నారు.
- రాజకీయ లబ్ధిగా మొదలైన కుట్ర.. ఆర్థిక కుంభకోణంగా బయటకు వచ్చింది.
- నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యితో లడ్డూలు చేసింది కూటమి ప్రభుత్వంలోనే.
- మంత్రి గారు పదేపదే మా గొంతు నొక్కుతున్నారు.
- ఏఆర్ డెయిరీ ట్యాంకర్లను వైష్ణవి డెయిరీ పేరుతో టీటీడీకి పంపారు.
- సంగం డెయిరీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లది.
- కల్తీ నెయ్యి ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి?.
- తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను ఎవరి ఒత్తిడితో అనుమతించారు?.
- సీబీఐ చార్జ్‌షీట్‌లో క్లియర్‌గా ఎటువంటి జంతు కొవ్వు లేదని చెప్పింది.
- ఫిర్యాదును పట్టుకుని సీబీఐ రిపోర్టు అంటూ ప్రచారం చేస్తున్నారు.
- చర్చ ప్రారంభించిన వెంటనే పర్వతరెడ్డిని అడ్డుకున్న మంత్రి అచ్చెన్నాయుడు.
- చంద్రబాబు అనలేదంటూ మండలి సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలు.
- పర్వతరెడ్డి ప్రసంగానికి పదేపదే అడ్డుతగులుతున్న మంత్రులు.
- పర్వతరెడ్డి చర్చ మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లోనే ఐదు సార్లు అడ్డుకున్న మంత్రులు.
- పర్వతరెడ్డి ప్రసంగాన్ని పదే పదే అడ్డుకుంటున్న మంత్రి పయ్యావుల.
మంత్రి అచ్చెన్నాయుడు ఓవరాక్షన్..
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలపై మంత్రి అచ్చెన్నాయుడు నోటి దురుసు
- ఓపిక లేకపోతే పో.. అంటూ దురుసు వ్యాఖ్యలు
- అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీల ఆగ్రహం
- లడ్డూపై చర్చకు ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్సార్‌సీపీ
- ప్రభుత్వం భయంతోనే సభలో గందరగోళం సృష్టించాలని చూస్తోంది.
చైర్మన్ సీరియస్..
- మంత్రుల వాదనలతో నేను ఏకీభవించడం లేదు: చైర్మన్
- తిరుమల లడ్డూ విషయం చాలా సున్నితమైనది.
- లడ్డూ ప్రసాదంపై చర్చ చాలా మర్యాదగా, గౌరవప్రదంగా జరగాలి.
మండలిలో మంత్రుల రగడ..
- చర్చ కంటే ముందు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని మంత్రి పయ్యావుల మెలిక.
- చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేయవచ్చన్న చైర్మన్.
- చైర్మన్‌తో మంత్రుల వాగ్వాదం.
- మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: చైర్మన్
- నేను తప్పు చేస్తున్నా అనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.
- కొత్త సాంప్రదాయం తీసుకు రావద్దన్న మండలి చైర్మన్.
- చైర్మన్ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అధికార సభ్యుల గందరగోళం.
- తిరుమల లడ్డు ప్రసాదంపై మండలిలో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర.
- ముందుగా స్టేట్‌మెంట్ ఇస్తామని ప్రభుత్వం పట్టు.
- స్వల్పకాలిక చర్చలో స్టేట్‌మెంట్ అనేది ఉండదు: చైర్మన్
- మండలి నిబంధనలపై చైర్మన్ మాట్లాడుతుండగా అడ్డుకుంటున్న మంత్రులు.
- మండలిలో తిరుమల లడ్డుపై చర్చ..
- మండలిలో లడ్డుపై చర్చకు చైర్మన్ అనుమతి.
మండలి చైర్మన్‌తో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల భేటీ..
- శాసనమండలి చైర్మన్‌తో భేటీ అయిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
- తిరుమల లడ్డుపై మండలిలో చర్చకు మండలి చైర్మన్ అనుమతి
- ప్రశ్నోత్తరాలు ముగిసిన తరవాత తిరుమల లడ్డుపై చర్చ
- ముందుగా వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడిన తర్వాత.. ప్రభుత్వం స్టేట్‌మెంట్ పాస్ చేసేలా నిర్ణయం
- గతవారం లడ్డుపై చర్చ సందర్భంగా ప్రభుత్వం ముందు స్టేట్‌మెంట్ పాస్ చేయడంపై అభ్యంతరం తెలిపిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
- నేడు తిరుమల లడ్డుపై చర్చకు ఆమోదం.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై అరుణ్ కుమార్ ప్రశ్న..
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై రైతుల అభ్యంతరాలను సభలో ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్
- ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..
- భూసేకరణపై అభ్యంతరాలకు తక్కువ సమయం ఇచ్చారు
- గ్రామసభలు, ప్రజాభిప్రాయసేకరణ పెట్టకుండానే భూ సేకరణపై ముందుకు వెళ్లారు
- భూ యజమానిని సంప్రదించకుండా భూములు తీసుకోవడం సరికాదు
- గెజిట్‌లో 140 మీటర్ల రోడ్డును 250 మీటర్లు చేశారు
- బఫర్ జోన్‌ను 500 మీటర్లు చేశారు
- దేశంలో ఎక్కడా ఔటర్ రింగ్ రోడ్డుకి ఇలా చేయలేదు
- మార్కెట్ రేట్ ప్రకారం గత మూడేళ్లలో ఎంత ఎక్కువ ఉంటే అంత ఇవ్వాలి
- కానీ అలా ఫాలో అవ్వడం లేదు
- సేకరించిన భూమిని వినియోగించకపోతే తిరిగి వెనక్కి ఇచ్చేయాలి..
- ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను రద్దుచేయాలి
- 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కొత్త గెజిట్ ను విడుదల చేయాలి.. రైతులను ఆదుకోవాలి
మండలి సమావేశాలు ప్రారంభం..
- ప్రారంభమైన శాసన మండలి సమావేశాలు
- ప్రశ్నోత్తరాలు ప్రారంభం


