చిన్నారులకు వైఎస్‌ జగన్‌ అన్నప్రాసన | YS Jagan Performs Annaprasana to Little Kids | Sakshi
Sakshi News home page

చిన్నారులకు వైఎస్‌ జగన్‌ అన్నప్రాసన

Mar 4 2026 5:55 AM | Updated on Mar 4 2026 12:21 PM

YS Jagan Performs Annaprasana to Little Kids

బాలుడికి అన్నప్రాసన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల కోరిక మేరకు ఇద్దరు చిన్నారులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నప్రాసన చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట 18వ వార్డు మెంబర్‌ చిట్లూరి వెంకటేష్, లక్ష్మీ చంద్రిక దంపతులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను కలిశారు.

వారి విజ్ఞప్తి మేరకు వారి కుమారుడు ఆర్యన్‌కు వైఎస్‌ జగన్‌ అన్నప్రాసన చేసి, ఆశీస్సులు అందజేశారు. అలాగే నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కార్యదర్శి శ్రావ్య రెడ్డి, జీవన్‌ రెడ్డి దంపతుల కోరిక మేరకు వారి కుమారుడు శ్రియాన్‌ రెడ్డికి వైఎస్‌ జగన్‌ అన్నప్రాసన చేసి, ఆశీస్సులు అందజేశారు. దీంతో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement