కోనసీమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ప్రభలతీర్థాలకి శతాబ్దాల చరిత్ర ఉంది.
సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థాలు కోనసీమ జిల్లాలో శుక్రవారం(జనవరి 16, 2026) ఘనంగా జరిగాయి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థం చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు.
పచ్చని చేలను తొక్కుకొంటూ గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారానికి చెందిన చెన్నమల్లేశ్వర స్వామి, వీరేశ్వర స్వామి ప్రభలను పంట కాలువ దాటిస్తున్న తీరు చూపరులను గగుర్పాటుకు గురిచేసింది.
అనంతరం.. 11 గ్రామాల నుంచి వచ్చిన ఏకాదశ రుద్రులు, ఉప ప్రభలు జగ్గన్నతోటలో కొలువుతీరాయి.


