కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Jan 18 2026 6:53 AM | Updated on Jan 18 2026 6:53 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026 నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం –8లోu ఉత్సాహంగా సౌత్‌ జోన్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ లీగ్‌ పోటీలు

న్యూస్‌రీల్‌

సంక్రాంతికి ఊళ్లకు వచ్చిన వారు తిరుగు ప్రయాణం అరకొరగానే ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ ఇదే అదునుగా చార్జీలు పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్‌ తనిఖీలు చేస్తున్నామనిచెబుతున్న ఆర్టీఏ అధికారులు

బెంబేలెత్తిస్తున్న చార్జీలు

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

కఠిన చర్యలు తీసుకుంటున్నాం

సాధారణ రోజుల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ (ఏసీ) సీటింగ్‌ అయితే వెయ్యి రూపాయల నుంచి రూ.1200, స్లీపర్‌ రూ.1500 నుంచి రూ.2 వేల వరకు చార్జీ వసూలు చేస్తాయి. బస్సులను బట్టి ఆ రేట్లు మారుతుంటాయి.

ప్రస్తుతం పండుగ సీజన్‌ కావడంతో సీటింగ్‌కు రూ.1600 నుంచి రూ.2500 వరకూ చార్జీలను నిర్ణయించాయి. డిమాండ్‌ను బట్టి రూ.3 వేలు నుంచి రూ.4 వేలు కూడా వసూలు చేస్తున్నాయి. స్లీపర్‌ చార్జీని రూ.2500 నుంచి రూ.3500 వరకు, డిమాండ్‌ను బట్టి రూ.4500 వరకూ పెంచేసి ప్రయాణికులను దోచుకుంటున్నాయి.

మరో వైపు ఆర్టీసీ శనివారం అరకొకరగా సర్వీసులు నడిపింది. ఆర్టీసీ కూడా స్పెషల్‌ బస్సులకు 50 శాతం చార్జీ అదనంగా వసూలు చేస్తోంది.

ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి ఏలూరుకు చెందిన వేములపల్లి సతీష్‌ చౌదరి కుటుంబం శని వారం రూ.1,01,116 విరాళం సమర్పించింది.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం ఆవరణలోని టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో సౌత్‌ జోన్‌ అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్‌ టెన్నిస్‌ మహిళల లీగ్‌ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రీడాకారులు సత్తాచాటారు. జూనియర్‌ సింగిల్స్‌ విభా గంలో నరుమూగయ్‌ (తమిళనాడు), సీనియర్‌ సింగిల్స్‌ విభాగంలో రాగశ్రీ (తమిళనాడు) చాంపియన్లుగా నిలిచారు. జూనియర్‌ విభాగంలో శ్వేత (తమిళనాడు) ద్వితీయ, సోనికా (కర్ణాటక), సంజూ (తమిళనాడు) తృతీయ స్థానాలను సొంతం చేసుకున్నారు. సీనియర్‌ విభాగంలో షాలిని (తమిళనాడు) ద్వితీయ, యాజిని (తమిళనాడు), సాధన (తమిళనాడు) తృతీయ స్థానాలను సాధించారు. జూనియర్‌ విభాగంలో మొదటి సెమీ ఫైనల్స్‌లో యాజిని (తమిళనాడు)పై 1–3 తేడాతో ఎ.ఎస్‌.షాలిని (తమిళనాడు), రెండో సెమీ ఫైనల్స్‌లో సాధన (తమిళనాడు)పై 0–3 తేడాతో నరుమూగయ్‌ (తమిళనాడు) విజయం సాధించారు. ఫైన ల్స్‌లో ఏఎస్‌.షాలిని (తమిళనాడు)పై 1–3 తేడాతో నరుమూగయ్‌ (తమిళనాడు) గెలు పొందింది. సీనియర్‌ విభాగంలో మొదటి సెమీ ఫైనల్స్‌లో సోనికా (కర్ణాటక)పై 0–3 తేడాతో రాగశ్రీ (తమిళనాడు), రెండో సెమీ ఫైనల్స్‌లో సంజూ (కేరళ)పై 0–3 తేడాతో శ్వేత (తమిళనాడు) గెలుపొందారు. ఫైనల్స్‌లో శ్వేత (తమిళనాడు)పై 0–3 తేడాతో రాగశ్రీ (తమిళనాడు) విజయం సాధించింది. ఆది, సోమవారాలు సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ డబల్స్‌ విభాగంలో మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చిన వారు సెలవులు ముగియడంతో తిరుగు పయనమవుతున్నారు. శనివారమే కొంత మంది బయలుదేరి వెళ్తుండగా, మరి కొందరు ఆదివారం ప్రయాణమవుతున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. డిమాండ్‌ను బట్టి టికెట్ల రేట్లు పెంచేస్తున్నారు. అసలు ధరకు రెండు, మూడు రెట్లు అమాంతం పెంచేశారు. దీంతో ఇదేమి దోపిడీ అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఆ తర్వాత బెంగళూరుకు డిమాండ్‌ ఏర్పడింది. నిత్యం విజయవాడ నుంచి హైదరాబాద్‌, వేర్వేరు ప్రాంతాలకు 200 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు నడుస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ మీదగా వెళ్లే బస్సులు మరో 400 వరకూ ఉంటాయి.

రిటర్న్‌ జర్నీకే ఎక్కువ డిమాండ్‌

ఈ ఏడాది సంక్రాంతి పండక్కి ముందు రెండో శనివారం, ఆదివారం రావడంతో హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంతాల నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి సొంతూళ్లకు రావడం ప్రారంభించారు. అలా మంగళవారం రాత్రి వరకూ నాలుగు రోజుల పాటు వస్తూనే ఉన్నారు. వారంతా శని, ఆదివారాల్లో తిరుగు ప్రయాణం చేస్తుండటంతో రద్దీ ఎక్కువైందని అధికారులు పేర్కొంటున్నారు. ట్రావెల్స్‌ నిర్వాహకులు దీనినే అదునుగా తీసుకుని ఏసీ, నాన్‌ ఏసీ సీట్ల చార్జీలను అమాంతం పెంచేసి ప్రయాణికులను దోచుకుంటున్నారు.

7

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 38.3148 టీఎంసీలు.

సంక్రాంతి పండుగ కోసం సొంత ఊర్లకు వచ్చేటప్పుడు కానీ తిరిగి వెళ్లేటప్పుడు కానీ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఈ తనిఖీలు ఆదివారం రాత్రి వరకూ కొనసాగుతాయి. అవసరమైతే సోమవారం కూడా నిర్వహిస్తాం. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 163 బస్సులపై కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు రూ.6,11,250 జరిమానాలు విధించాం.

– ప్రవీణ్‌, ఆర్టీఓ, విజయవాడ

కృష్ణాజిల్లా1
1/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా6
6/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా7
7/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా8
8/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా9
9/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా10
10/10

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement