స్కూటీ అదుపుతప్పి లోయలోపడ్డ యువతి | Young Woman Jahnavi Scooty Incident In Visakhapatnam | Sakshi
Sakshi News home page

స్కూటీ అదుపుతప్పి లోయలోపడ్డ యువతి

Sep 22 2026 9:30 AM | Updated on Sep 22 2026 9:30 AM

Young Woman Jahnavi Scooty Incident In Visakhapatnam

విశాఖపట్నం: దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఓ యువతి స్కూటీ అదుపు తప్పి స్థానిక వేంకటాద్రి కొండను ఆనుకుని ఉన్న లోయలో పడిపోయింది. దాదాపు 30 అడుగుల లోయలో పడివున్న సదరు యువతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. వివరాలివి.. చినముíÙడివాడ శారాదపీఠం ప్రాంతంలో నివాసం ఉంటున్న జాహ్నవి(24) సోమవారం ఉదయం వేంకటాద్రిపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి దర్శనానికి వెళ్ళింది. 

తిరిగి స్కూటీపై దిగువ ఘాట్‌లో వస్తున్న క్రమంలో అదుపు తప్పి, పక్కనే ఉన్న లోయలో స్కూటీతో సహా పడిపోయింది. బాగా లోతులోకి పడిపోయిన ఆమె బిగ్గరగా అరవడంతో స్థానికులు ప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కేవీ సతీష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీస్‌ బృందం లోయలోకి దిగి జాహ్నవిని సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. చిన్నపాటి గాయాలతో పాటు, తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాల్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement