సాక్షి, ఆంధ్రప్రదేశ్: నంద్యాల జిల్లా, గోరుకల్లు గ్రామంలోకి ఒక్కసారిగా భారీగా వరద నీరు చేరడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి పెద్దఎత్తున నీరు గ్రామం వైపు రావడంతో చేసేదేమీ లేక పలువురు ఇళ్లను వదిలి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు కనిపించింది.
ఈ వరద నీరు గోరుకల్లు రిజర్వాయర్ నుంచే గ్రామంలోకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. రిజర్వాయర్ నుంచి నీరు వృథాగా బయటకు పోతున్నా అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
అయితే, అనధికార వ్యక్తులు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతోనే గ్రామంలోకి వరద వచ్చిందని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో ఈ విషయంపై అధికారులను నిలదీశారు. అలాగే, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:


