యానాంలో రికార్డు ధర పలికిన పులస చేప | Record Price Pulasa Fish In Yanam Market | Sakshi
Sakshi News home page

యానాంలో రికార్డు ధర పలికిన పులస చేప

Sep 22 2026 12:54 PM | Updated on Sep 22 2026 1:02 PM

Record Price Pulasa Fish In Yanam Market

సాక్షి, యానాం: గోదావరి పులస చేపకు ఉండే క్రేజే వేరు. సీజన్‌లో ఒక్క పులస చేప మార్కెట్‌లోకి వచ్చిందంటే చాలు.. దాన్ని దక్కించుకునేందుకు కొనుగోలుదారులు పోటీపడుతుంటారు. రుచికి పెట్టింది పేరైన ఈ చేప తాజాగా యానాం మార్కెట్‌లో మరోసారి రికార్డు ధర పలికింది. రెండు కిలోల బరువున్న పులస చేపను వేలం పాటలో ఏకంగా రూ.26 వేలకు కొనుగోలు చేశారు.

 

 

గోదావరి నదిలో మత్స్యకారుల వలకు చిక్కిన ఈ పులసను యానాం మార్కెట్‌కు తీసుకొచ్చారు. అక్కడ నిర్వహించిన వేలం పాటలో చేపను దక్కించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు.  కోటిపల్లికి చెందిన మత్స్యకారుడు మల్లాడి సత్యనారాయణ  రూ.26 వేల ధరకు పులసను సొంతం చేసుకున్నారు.

-తూర్పు గోదావరి జిల్లా

ఇదీ చదవండి: టీఎన్‌ 07 సీఎం 2031..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement