టీఎన్‌ 07 సీఎం 2031..! | VCK Leader Thirumavalavan Spotted in Car Bearing ‘TN 07 CM 2031’ | Sakshi
Sakshi News home page

టీఎన్‌ 07 సీఎం 2031..!

Sep 22 2026 12:19 PM | Updated on Sep 22 2026 12:25 PM

VCK Leader Thirumavalavan Spotted in Car Bearing ‘TN 07 CM 2031’

సాక్షి, చెన్నై: వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్‌ ప్రయాణిస్తున్న కార్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ తాజాగా చర్చకు దారి తీసింది. టీఎన్‌ 07 సీఎం 2031 నెంబర్‌తో ఆ కారు ఉండటం ఈ చర్చకు కారణం. 2031లో తమిళనాట జరిగే అసెంబ్లీ ఎన్నికలలో  తిరుమా సీఎం అన్న నినాదాన్ని సూచించే విధంగా ఈ నెంబర్‌ ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. 

ఆ నంబర్‌ ప్లేట్‌ భవిష్యత్‌ సీఎం పదవికి సంకేతమని ఆయన పార్టీ శ్రేణులు వీసీకే వర్గాలు ఉత్సాహంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తుండటం గమనార్హం. కాగా, విజయ్‌ నటించిన చిత్రంలో ఆయన ఉపయోగించిన కారు  రిజిస్ట్రేషన్ నంబర్‌ టీఎన్‌ 07 సీఎం 2026గా చూపించారు. ఆ మేరకు 2026లో విజయ్‌ సీఎం కావడంతో తిరుమా కూడా సీఎం కావడం తథ్యమన్నట్టుగా వీసీకే వర్గాలు ఉత్సాహం చూపిస్తుండటం ఈ చర్చకు ప్రధాన కారణంగా మారింది.   

ఇదీ చదవండి: యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement