ఢిల్లీ: యూపీ, ఉత్తరాఖండ్‌లలో 11 రాజ్యసభ సీట్లకు ఈసీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. యూపీలో 10 సీట్లకు, ఉత్తరఖండ్‌లో ఒక సీటుకు ఎన్నిక జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో రుక్మిణి నాయక్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. యూపీ, ఉత్తరాఖండ్ రాజ్యసభ ఎంపీల పదవీ కాలం నవంబర్ 25తో ముగుస్తుంది.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎంపీలు అరుణ్ సింగ్ ,గీత అలియాస్ చంద్రప్రభ, నీరజ్ శేఖర్ , బ్రి జ్ లాల్ , ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, రాంజీ ,బి ఎల్ వర్మ, సీమ నరేష్, బన్సల్ రిటైర్ కానున్నారు. సెప్టెంబర్ 29న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అక్టోబర్ 16న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది.
ఇదీ చదవండి: ‘చిన్న విషయమే..’ జముయి ఘటనపై షాకింగ్ వ్యాఖ్యలు


