151 అంబేడ్కర్‌ విగ్రహాలు కూలగొట్టారు  | 151 Ambedkar statues desecrated in UP under BJP govt says Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

151 అంబేడ్కర్‌ విగ్రహాలు కూలగొట్టారు 

Sep 21 2026 6:40 AM | Updated on Sep 21 2026 6:40 AM

151 Ambedkar statues desecrated in UP under BJP govt says Akhilesh Yadav

యూపీలో బీజేపీ ప్రభుత్వంపై అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపణ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలన కాలంలో 151 బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలు నేలమట్టమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. 72 జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 14 మందిని మాత్రమే అరెస్ట్‌ చేసిందని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నించి, విఫలమైన బీజేపీయే ఉద్దేశపూర్వకంగా వీటిని కూల్చివేసిందని ఆరోపించారు. 

అఖిలేశ్‌ ఆదివారం లక్నోలో మీడియాతో మాట్లాడారు. ‘‘ గత 15 ఏళ్ల బీజేపీ పాలనాకాలంలో మొత్తంగా 151 అంబేడ్కర్‌ విగ్రహాలు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మొత్తంగా చూస్తే ఏడాదికి 15 విగ్రహాల చొప్పున నాశనంచేశారు. 45 ఘటనల్లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. 84 కేసుల్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. లెక్కలోకి రాని ఘటనలు చాలా ఉన్నాయి. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతాలను అనుసరించే వారు ముందుగా దేశ రాజ్యాంగాన్నే లక్ష్యంగా చేసుకుంటారని పేర్కొన్నారు. 

రాజ్యాంగం, అంబేడ్కర్, ఆయన అనుచరులంటే బీజేపీకి ఎటువంటి గౌరవం లేదు’’అని అఖిలేశ్‌ విమర్శించారు. అయోధ్య  రామాలయం నిధులను సక్రమంగా వినియోగించుకోవడం, పక్కదారి పట్టకుండా చూడటమే అసలైన సనాతన ధర్మమని బీజేపీపై విరుచుకుపడ్డారు. యూపీలో పేపర్‌ లీకేజీలు పెరిగాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బీజేపీకి 27 వేల వరకు ఓట్లను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అఖిలేశ్‌ చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి తమ పార్టీకి అదనంగా 27 వేల ఓట్లు పడేలా కార్యాచరణను రూపొందించినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement