93 ఏళ్ల తాత కోసం రాముడి విగ్రహం..!: ఉపాసన కొణిదెల | Upasana Konidela Commissions A Sri Rama Murti For 93 Year old Grand father | Sakshi
Sakshi News home page

Upasana Konidel: 93 ఏళ్ల తాత కోసం రాముడి విగ్రహం..!

Sep 22 2026 12:14 PM | Updated on Sep 22 2026 12:14 PM

Upasana Konidela Commissions A Sri Rama Murti For 93 Year old Grand father

పారిశ్రామికవేత్త, టాలీవుడ్‌ నటుడు రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కొణిదెలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటుంటారు. కుటుబంతో కలిసి జరుపుకున్న ప్రతి పండుగకు సంబంధించిన మధుర క్షణాలను ఆమె సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంటుంటారు. URLife' వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్ ఉపాసన కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించిన విశేషాలను సైతం పంచుకున్నారు. తాజాగా అయోధ్య ఆలయంలోని  'రామ్ లల్లా'కి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేసుకున్నారు. 

 

హిందూ ఇతీహాసాల్లో రామాయాణంకి ఉన్న మహాత్తు అంతా ఇంత కాదు. అందులోనూ ఏడు కాండలలో సుందర కాండకు ఉన్న విశిష్టిత మాటల్లో చెప్పలేనిది. పేరుకి తగ్గట్టుగానే అ‍త్యంత సుందరమైన కాండ ఇది. అలాంటి మహిమాన్వితమైన సుందరకాండ పారాయణాన్ని ఇటీవలే సెప్టెంబర్‌ 21న దిగ్విజయంగా పూర్తిచేసినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది ఉపాసన. అదే రోజున అత్యంత యాదృశ్చికంగా అయోధ్య రామమందిరంలోని బాలరాముని విగ్రహాన్ని రూపొందించిన యోగిరాజ్‌ చేత తను చేయించుకున్న రాముని విగ్రహం కూడా పూర్తి అయ్యిందని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది ఉపాసన. 

తన సుందరకాండ పారాయణం పూర్తి అయ్యిన రోజునే ఈ విగ్రహం తయారీ పూర్తి అవ్వడం నిజంగా తనకు చాలా ప్రత్యేకమంటూ పోస్టులో చాలా సంబరంగా పేర్కొంది. అంతేగాదు ఆ సంతోషకరమైన సంఘటన గురించి ఉపాసన పోస్ట్‌లో ఇలా వివరించింది. తాను బాలరాముని విగ్రహాన్ని రూపొందించిన అరుణ్‌ యోగిరాజ్‌  చేత ఈ విగ్రహాన్ని చేయించుకోవాలని సుమారు ఏడాది క్రితమే నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అది తన 93 ఏళ్ల తాతగారి కోసం చేపట్టిన ప్రాజెక్టుగా పేర్కొంది. సుందరకాండ పట్ల ఆయనకున్న జీవితకాల భక్తి  తనకు సదా స్ఫూర్తినిస్తూనే ఉంటుందని వెల్లడించింది. పైగా తన పారాయణం పూర్తి అయ్యిన రోజే ఈ విగ్రహం సిద్ధమవ్వడం దైవిక సంక్పంగా భావిస్తున్నా, అని భావోద్దేవగం పోస్ట్‌లో రాసుకొచ్చింది ఉపాసన. 

కాగా, జూన్‌ 2026లో అపోలా హాస్పిటల్స్‌ సీఎస్‌ఆర్‌ విభాగం వైస్‌ చైర్‌పర్సన్‌ ఉపాసన కొణిదెల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నుంచి లక్ష్మీ దేవి విగ్రహాన్ని అందుకున్న ఫోటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సుకి చిహ్నంగా పేర్కొంటూ..ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత జీవితాలకు చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా మారగలిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించమని కోరింది పోస్ట్‌లో. ప్లీజ్‌ అందరం ఇప్పటికైనా ఆర్థిక అక్షరాస్యత దిశగా పయనిద్దాం అంటూ పోస్ట్‌ని ముగించింది ఉపాసన. 

 

(చదవండి: జింకపిల్లకు పులిపాలు!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement