స్లిమ్‌గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్‌ తర్వాత బరువు తగ్గాలంటే.. | weight loss: Upasana Konidelas postpartum weight loss | Sakshi
Sakshi News home page

Upasana Konidela: స్లిమ్‌గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్‌ తర్వాత బరువు తగ్గాలంటే..

Jun 30 2026 3:41 PM | Updated on Jun 30 2026 3:50 PM

weight loss: Upasana Konidelas postpartum weight loss

ఈ ఏడాది జనవరిలో టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కొణిదెల కవలలకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల హీరో రామ్‌చరణ్‌ పెద్ది సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. ఆ నేపథ్యంలో జరిగి సక్సెస్‌ మీట్‌లో ఉపాసన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఐదు నెలలే అయినా ఎంత స్మార్ట్‌గా మారింది అంటూ సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఒక్కరికి జన్మనిచ్చిన తల్లులు బరువు తగ్గడమే కష్టం అలాంటిది ఇద్దర పిల్లలకు జన్మనిచ్చిన తల్లలు బరువు తగ్గడం మరింత సవాలుగా ఉంటుంది. అలాంటిది ఉపాసన ఐదు నెలల్లోనే చాలా నాజుగ్గా ఆకర్షణీయంగా మారారు. అసలు ట్విన్స్‌‌ తర్వాత బరువు తగ్గడం ఎలా?, అది సాధ్యమేనా? అంటే..

ఒక గర్భంతో పోలిస్తే.. కవలల గర్భం తర్వాత బరువు తగ్గడం చాలా కష్టమనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా మహిళలు గర్భధారణ సమయంలో అధికంగా బరువు పెరుగుతారు. వారి శరీరాలు మరిన్నీ శారీరక, హార్మోనల్‌ మార్పులకు లోనవ్వుతాయి. శరీరం కోలుకోవడం కోసం కండరాల బలం తిరిగి నిర్మించుకోవడానికి, ఇద్దరు పిల్లల సంరక్షణ ఇదంతా ఒక పెద్ద సవాలుగా పేర్కొన్నారు. 

కొత్త తల్లులు యథావిధిగా ఇదివరకటిలా నార్మల్‌ స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని కూడా అన్నారు. అయితే ప్రసవానంతరం కోలుకోవడం అనేది పరుగుపందెం లాంటిది కాదని గ్రహించాలన్నారు. ప్రతి మహిళ శరీరం ఒకేలా స్పందించదని అన్నారు అందువల్ల ఆరోగ్యకరంగా స్థిరంగా బరువు తగ్గేందుకే ప్రయత్నించాలని అన్నారామె. 

బరువు తగ్గాలంటే..
ప్రసవానంతరం బరువు తగ్గాలంటే చక్కటి  నిద్ర, సమతుల్య భోజనం, తగినంత నీరు, తగిన కదలికలు ఉండాలన్నారు. కొత్త తల్లులు కఠినమైన ఆహార నియమాలు పాటించొద్దని అన్నారు. ముఖ్యంగా పాలిచ్చేవాళ్లకు మరింత ప్రమాదమని అన్నారు. 

శరీరం ఆ స్థితి నుంచి కోలుకోవడానికి, శక్తి కోసం తగిన పోషకాలు అవసరం. ఈ టైంలో కేలరీలు లెక్కించడం మానేసి, ప్రోటీన్, ఫైబర్‌, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పౌష్టికరమైన భోజనంపై దృష్టి సారించమని సూచిస్తున్నారు. 

ఆ తప్పులు అస్సలు చెయ్యొద్దు..

  • సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ప్రభావంతో బరువు తగ్గే ప్రయత్నం చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే వాళ్లు పోషకాహర నిపుణులు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ల సమక్షంలో ఆయా డైట్‌ విధానాలు అనుసరిస్తారు కాబట్టి గుడ్డిగా అనుసరించొద్దని అన్నారు. 

  • అలాగే తక్షణ ఫలితాలు ఆశించొద్దని చెప్పారు. తొమ్మిది నెలల్లో పెరిగిన బరువు కొన్ని వారాల్లో మాయమవ్వాలంటే తీవ్రమైన డైటింగ్‌, భోజనం మానేయడం, అతిగా వ్యాయామాలు చేయడం, బరువు తగ్గించే సప్లిమెంట్లపై ఆధారపడటం వంటివి పూర్తి స్థాయిలో కోలుకోవడాన్ని ఆటంక పరుస్తుందని అన్నారు.

కొత్త తల్లులూ ఇది మరవద్దు..
ప్రసవానంతరం ఫిట్‌నెస్‌ అంటే బలాన్ని తిరిగి నిర్మించుకోవడం అంతేతప్ప మాటిమాటికీ బరువు చెక్‌చేస్తూ..నెంబర్‌ని వెంబడించడం కాదు. ఆరోగ్యకరమైన శరీరం, స్థిరమైన పురోగతి, బిడ్డను చూసుకోవడానికి తగినంత శక్తిమంతంగా ఉండటం అనేవి ప్రధానం అని గ్రహించండి. ఏ క్రాష్‌ డైట్‌ ఈ సమయంలో అస్సలు పనికిరాదు. కేవలం ఓర్పు, నిలకడతో పాటించే మంచి అలవాట్లతోనే సత్ఫలితాలను పొందగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 (చదవండి: అనురాగ్‌ కశ్యప్‌ వెయిట్‌లాస్‌ స్టోరీ..!అలా తగ్గడం మంచిదేనా?)

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement