పాత్రికేయ రంగం అంటేనే సంఘర్షణలతో ముడిపడి ఉంటుంది. ఏది పడితే అది రాసే అవకాశం ఉండదు. అధికారులకు అననుకూలంగా రాసామో అంతే సంగతులు. అలాంటి రక్షణలేని వృత్తి ఇది. ఎప్పుడు మీడియా గొంతును నొక్కేసేలా దాడులు, కక్ష సాధింపు చర్యలు ఉంటూనే ఉంటాయి. కానీ తొలిసారిగా మహిళల హక్కులు, ప్రకృతి విపత్తుల కోసం చాలా చురుకుగా ప్రపంచానికి తెలియజేసే ఓ ఫోటో జర్నలిస్ట్ జైలు పాలవ్వడమే కాదు ఎన్నే ఏళ్లు జైలు శిక్ష విధించారో తెలిస్తే కంగుతింటారు. పైగా పాత్రికేయరంగంలో ఇన్ని సవాళ్లు ఉంటాయా అనిపిస్తుంది. మంచి జరగాలని ప్రయత్నిస్తే మొత్తానికి వాళ్ల కథే ముగిసిపోతుంది అనేలా అయ్యింది ఈ జర్నలిస్ట్ పరిస్థితి.
ఇరాన్ దేశల్లో నిరసనలు, మహిళలు జీవితాలను డాక్యుమెంట్ చేయడంలో పేరుగాంచిన ఫోటో జర్నలిస్ట్‌కి జైలుపాలవ్వడమే కాదు ఏకంగా 15 ఏళ్లు జైలు శిక్ష విధించారు. 2025లో ఇరాన్‌ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం ఈ శిక్షణు విధించింది. ఇది గూఢచర్యం, శత్రుదేశాల సహకారాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన చట్టం. ఆమెపై జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశారనే ఆరోపణలతో టెహ్రాన్ కోర్టు ఈ శిక్ష విధించింది.
ఆమె ఇరాన్ అధికారులకు ప్రతికూలంగా ఉండే మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారని, యూఎస్ ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న సంస్థలకు ఫోటోలు అందించారని ఆరోపణలతో ఆమెకు ఈ శిక్ష విధించినట్లు ఇరాన్ అంతరంగిక వర్గాల సమాచారం. అంతేగాదు ఇంటెలిజెన్స్ వింగ్ సభ్యులు ఆమె ఇంటిపై దాడిచేసి, ల్యాప్‌టాప్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. కనీసం ఆమె కేసుకి సంబంధించిన కాఫీలు కూడా ఇవ్వకుండా కోర్టు ముందుంచి ఈ శిక్ష విధించడం గమనార్హం.
ఇదిలా ఉండగా మోయిరీ ఇరాన్‌లో వైమానిక దాడుల వల్ల జరిగిన నష్టాన్ని చూపించే ఫోటోల తోపాటు తన పనికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇలా మోయిరీపై ఇరాన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఇదేమి ఆమెకు మొదటి జైలు శిక్ష కాదు, గతంలో ఘర్చక్ జైలులో రెండేళ్లు శిక్షఅనుభవించింది. అలాగే 2022లో, పోలీసు కస్టడీలో మహ్సా అమినీ మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా "స్త్రీ, జీవితం, స్వేచ్ఛ" నిరసనలను కవర్ చేసినందుకు గానూ ఏకంగా ఎనిమిది నెలలు జైలు శిక్ష విధించగా మూడేళ్లు శిక్ష అనుభవించి క్షమాభిక్ష అనంతరం విడుదలైంది. తాజాగా మరోసారి సుదీర్ఘ జైలు శిక్షను ఎదుర్కొంటుండటం గమనార్హం.
(చదవండి: అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా రక్తంతో ఫేషియల్..! అందం కోసం ఇంత పెయిన్ తప్పదా?)


