మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన పెళ్లిరోజు నేడు. 2012లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు పద్నాలుగేళ్ల అన్యోన్య దాంపత్యాన్ని పూర్తి చేసుకున్నారు. గతవారం రిలీజైన 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్ ఆకట్టుకోగా.. ఉపాసన ఓవైపు తన పనులు, మరోవైపు ముగ్గురు పిల్లల్ని కూడా చూసుకుంటూ బిజీగా ఉంది. ఇప్పుడు పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన నుంచి చిన్నపాటి సర్‌ప్రైజ్ వచ్చింది.
(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు)
రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న కూతురు పుట్టగా.. ఆ పాపకు క్లీంకార అని పేరు పెట్టారు. ఇకపోతే ఈ ఏడాది జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనిచ్చింది. ఇందులో ఓ పాప, బాబు ఉన్నారు. బాబుకి శివరామ్, పాపకు అన్వీరా దేవి అని పేరు పెట్టారు. పుట్టిన తర్వాత ఎలాంటి ఫొటోలు బయటకు రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన.. తన పిల్లలు చేతులున్న ఫొటోని పోస్ట్ చేసి మనసు నిండిపోయింది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కి పలువురు సెలబ్రిటీలు లవ్ ఎమోజీలతో తన ప్రేమని చూపిస్తున్నారు.
(ఇదీ చదవండి: లాంగ్ గ్యాప్ తీసుకోనున్న రామ్ చరణ్?)


