రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్.. రాముడు, సీత, రావణుడిగా నటించిన చిత్రం 'రామాయణ'. ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మొదట ఈనెల 24న యూట్యూబ్‌లోనే విడుదల చేస్తామని తెలిపారు. కానీ అలా కుదరలేదు. ముందుగా ప్రకటించినట్లుగానే తాజాగా రామాయణ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ ఉదయం 4 గంటల 15 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తుంటే రామాయణ మరో రేంజ్‌లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ నితీశ్ తివారీ రామాయణం విజువల్ వండర్‌లా కనిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముల పాత్రల్లో సరికొత్తగా కనిపించారు. రావణుడితో యుద్ధం సీన్స్ ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది దీపావళికి ప్రపంచవ్యాప్తంగా రామాయణ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్‌లా ఉన్న ట్రైలర్ మీరు కూడా చూసేయండి.


