మెగా హీరో రామ్ చరణ్ రీసెంట్‌గానే 'పెద్ది'తో వచ్చాడు. రూ.400 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి గానీ యునానిమస్ హిట్ అయితే అనిపించుకోలేదు. థియేటర్లలో రన్ చివరకొచ్చేసింది. మరోవైపు రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఎట్టకేలకు తమ కూతురు క్లీంకార ఫేస్ రివీల్ చేశారు. పాప మూడో పుట్టినరోజు సందర్భంగా ఉపాసన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?)
చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్.. 2012 జూన్‌లో ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. కానీ దాదాపు పదకొండేళ్ల తర్వాత అంటే 2023 జూన్‌లో వీళ్లకు ఆడపిల్ల పుట్టింది. అప్పటినుంచి ఆమెని కెమెరాల కంట పడనివ్వలేదు. ఇప్పుడు మూడో పుట్టినరోజు సందర్భంగా ముఖాన్ని బయటపెట్టారు. చరణ్, ఉపాసన.. క్లీంకారని ఎత్తుకున్న ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఉపాసన-చరణ్ దంపతులకు ఈ ఏడాది జనవరిలో ట్విన్స్ పుట్టారు. ఇందులో అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. వీళ్లకు శివరామ్, అన్వీరా అని పేర్లు పెట్టారు. వీళ్లని కూడా మూడో పుట్టినరోజు నాడు చూపిస్తారేమో?
(ఇదీ చదవండి: ఇన్‌స్టా నుంచి సినిమాల్లోకి.. ఎవరయ్యా సమంత ఫ్రెండ్?)


