ఒకప్పటి స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈమె భర్త రాజ్ నిడిమోరు కథ అందించగా, సమంత లీడ్ రోల్ చేయడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించింది. ఓ మాదిరి అంచనాలతో నిన్న(జూన్ 19) థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరి తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయి? సమంత ఎలాంటి మ్యాజిక్ చేసింది?
(ఇదీ చదవండి: రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా: సమంత)
నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్లకే తాను మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డట్లు సమంత బయటపెట్టింది. ఆ టైంలోనే విజయ్ దేవరకొండతో 'ఖుషి' చేసింది. తర్వాత మళ్లీ సినిమాలు చేయడం మానేసింది. గతేడాది వచ్చిన 'శుభం'తో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు 'మా ఇంటి బంగారం'తో హీరోయిన్‌గా కమ్ బ్యాక్ ఇచ్చింది.
'బాషా' టెంప్లేట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఫస్టాప్ బాగున్నప్పటికీ సెకండాఫ్‌లో కొన్ని మైనస్‌లు ఉన్నాయని చూసినోళ్లు చెబుతున్నారు. ఇలా టాక్ సంగతి పక్కనబెడితే తొలిరోజు రూ.13.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్ వైరల్ అవుతుంది. సమంతకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే ఇంకా ఈమెకు కాస్తోకూస్తో మార్కెట్ బాగానే ఉందని చెప్పొచ్చు. వీకెండ్ నిలబడిన దానిబట్టి లాభాలు రావడం లేనిది క్లారిటీ వస్తుంది.
'మా ఇంటి బంగారం' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో స్వర్ణ(సమంత) అనాథాశ్రమంలో పెరుగుతుంది. ఓ పెద్దింటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఇంట్లో చెప్పకుండా వివాహం చేసుకున్నాడని అనిరుధ్‌ని అతడి కుటుంబం దూరం పెట్టేస్తుంది. తన కారణంగానే దూరమైన కుటుంబాన్ని తన భర్తకు మళ్లీ తిరిగివ్వాలనేది స్వర్ణ కోరిక. ఇంతలో ఆ ఇంట్లో ఓ శుభకార్యం కలిసొస్తుంది. అలా తొలిసారి అత్తారింట్లోకి అడుగు పెడుతుంది స్వర్ణ. అత్త ఇంటి ఆచారాలు, కట్టుబాట్లు ఏమాత్రం తెలియని స్వర్ణ ఎలాగైనా అన్నీ నేర్చేసుకుని అందరి ప్రేమని పొందాలనుకుంటుంది. అందుకోసం ఏం చేసింది? ఆమెని వెంటాడిన గతం వల్ల ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది? ఇంతకీ ఆమె గతమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)


