ప్రస్తుతం 'రాకా' సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. వైజాగ్‍లో కనిపించాడు. తన 'ఏఏఏ సినిమాస్' మల్టీప్లెక్స్‌ని ఘనంగా ప్రారంభించాడు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఇలా ఓ మల్టీప్లెక్స్ ఉండగా.. ఇప్పుడు విశాఖపట్నంలోనూ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై అస్సలు నడవలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: భారత క్రికెటర్ జైస్వాల్‌తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్)
'గంగోత్రి' రోజుల్లో వైజాగ్ రోడ్డుపై ఎవరూ నన్ను గుర్తుపట్టేవారు కాదు. ఇప్పుడు అదే రోడ్డుపై నడవలేకపోతున్నాను. 'రాకా' షూటింగ్ ముంబైలో జరుగుతోంది. వైజాగ్ ప్రజల కోసం ఒక రోజు బ్రేక్ అడిగి వచ్చాను. అయితే పోలీసులు నన్ను ఎయిర్‌పోర్ట్ నుంచి పువ్వుల్లో పెట్టుకుని తీసుకొచ్చారు. వాళ్లకు థ్యాంక్స్' అని అన్నాడు. ఇక ఎదురుగా ఉన్న కొందరు అభిమానులు ఫొటో కావాలని అడగడంతో అందరూ ఇక్కడికి వచ్చేయండి అని స్టేజీపైకి ఆహ్వానించాడు. ఫ్యాన్స్‌కి నో అని చెప్పటం నా వల్ల కాదమ్మా అని అన్నాడు.
ఎనిమిది స్క్రీన్లు ఉన్న ఈ మల్టీప్లెక్స్‌లో 'పుష్ప'లో గడ్డం కింద చేయి పెట్టే పోజు ఉన్న బన్నీ బొమ్మని ప్రదర్శన కోసం ఉంచారు. అలానే అల్లు అర్జున్‌కి సంబంధించిన పలు సినిమా స్టిల్స్ కూడా ఉంచారు. ఇకపోతే ప్రస్తుతం 'రాకా' చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ తన 23వ మూవీ చేయనున్నాడు. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
(ఇదీ చదవండి: ఆమె బదులు మరెవరున్నా తల పీక్కుని పారిపోయేవాళ్లు: విశాల్)
#Gangotri Movie Shooting రోజుల్లో #Vizag రోడ్లపై వెళ్తున్నప్పుడు Nannu ఎవరూ గుర్తుపట్టేవారు కాదు...#AlluArjun pic.twitter.com/6Hevu8EiXN
— Milagro Movies (@MilagroMovies) August 9, 2026
The ICONIC PUSHPA Pose @alluarjun 🙅🏻🔥
📍 AAA Cinemas, Vizag#AlluArjun @aaacinemasoffl #Pushpa2TheRule pic.twitter.com/V0o18cVzUj— Pushpa2TheRule 𝕏🧢 (@uicaptures) August 9, 2026


