ఆమె బదులు మరెవరున్నా తల పీక్కుని పారిపోయేవాళ్లు | Vishal Opens Up About Sai Dhanshika’s Support In Making Magudam, Says She Stood By Him Through His Toughest Phase | Sakshi
Sakshi News home page

Vishal: ఆయన పరిచయం చేసిన 45వ దర్శకుడిని నేను

Aug 9 2026 3:03 PM | Updated on Aug 9 2026 4:26 PM

Vishal About Sai Dhanshika Support Making Magudam Movie

తమిళ హీరో విశాల్‌ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా 'మకుటం'. హీరో కూడా ఇతడే. అంజలి, దుషారా విజయన్‌ హీరోయిన్లు. ఆర్బీ చౌదరి నిర్మించిన 99వ చిత్రమిది. జీవి ప్రకాష్‌ కుమార్‌ సంగీతమందించాడు. ఈ శుక్రవారం(ఆగస్టు 14) తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో విశాల్‌ త్రిపాత్రాభినయం చేశాడు. తాజాగా చైన్నెలోని ఓ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో విశాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ)

దర్శకుడుగా నాకు అవకాశమిచ్చిన నిర్మాత ఆర్బీ చౌదరికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆయన పరిచయం చేసిన 45వ దర్శకుడిని నేను. ఆమధ్య 14 నెలలుగా ఖాళీగా ఉన్నప్పుడు నా కష్టకాలంలో అండగా నిలిచి ప్రోత్సహించిన నా కాబోయే భార్య సాయి ధన్సికకు ధన్యవాదాలు. ఆమె స్థానంలో ఎవరైనా ఉంటే తల పీక్కుని పారిపోయేవారు. నా గురువు అర్జున్‌కి కృతజ్ఞతలు. నన్ను నటించమని ప్రోత్సహించింది ఆయనే. రాంగోపాల్‌ వర్మ తీసిన 'శివ' చూసిన తర్వాత దర్శకుడిని అవ్వాలనే కోరిక కలిగింది. అది 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు నెరవేరింది. నా తల్లిదండ్రులకు ఎప్పుడు రుణపడి ఉంటాను. వారి ప్రోత్సాహమే నన్ను స్థాయికి చేర్చింది అని విశాల్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?: నాగవంశీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement