కోలీవుడ్ హీరో విశాల్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం మకుటం. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దుషార విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలోనే మకుటం తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విశాల్ మూడు గెటప్‌ల్లో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే యాక్షన్‌తో పాటు కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తెలుగు ట్రైలర్ చూసేయండి.


