'నన్ను కమిట్‌మెంట్‌ అడిగారు'.. చాందిని చౌదరి షాకింగ్ కామెంట్స్ | Tollywood actress Chandini Chowdary about Casting Couch | Sakshi
Sakshi News home page

Chandini Chowdary: 'క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం.. నన్ను కమిట్‌మెంట్‌ అడిగారు'

Aug 7 2026 8:15 PM | Updated on Aug 7 2026 8:32 PM

Tollywood actress Chandini Chowdary about Casting Couch

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కామన్. ముఖ్యంగా నటీమణులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. ఇప్పటికే పలువురు సినీతారలు తమకెదురైన చేదు అనుభవాలను పలు సందర్భాల్లో బయటికి చెప్పుకొచ్చారు. తాజాగా మరో టాలీవుడ్ నటి సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన కామెంట్స్ చేసింది.

టాలీవుడ్‌ నటి చాందిని చౌదరి తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. 2015లో ఓ బ్రాండ్ అంబాసిడర్‌ ఛాన్స్ పేరుతో తనను పిలిచారని తెలిపింది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఫోన్‌ చేసి కమిట్‌మెంట్‌ ఇవ్వాలని అడిగారని గుర్తు చేసుకుంది. తాను తిరస్కరించడంతో మా అమ్మకు ఫోన్ చేసి కూడా అవమానించాడని చాందిని చౌదరి వెల్లడించింది. అంతేకాకుండా తనపై నెగెటివ్‌ ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది. చాందినికి పొగరు ఎక్కువనే ముద్ర వేశారని..అది ఇప్పటికీ తనని ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడిదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement