ఎన్టీఆర్ డైలాగ్‌పై వివాదం.. వరుణ్ తేజ్ రియాక్షన్‌ ఇదే..! | Varun Tej Clarity On Sr NTR Dialogue In Korean Kanakaraju Movie | Sakshi
Sakshi News home page

Korean Kanakaraju Movie: 'మా ఉద్దేశం అది కాదు'.. ఎన్టీఆర్ డైలాగ్‌ వివాదంపై వరుణ్ తేజ్..!

Aug 7 2026 6:13 PM | Updated on Aug 7 2026 6:28 PM

Varun Tej Clarity On Sr NTR Dialogue In Korean Kanakaraju Movie

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు ఇవాళే థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఈ మూవీలోని ఓ డైలాగ్ వివాదానికి దారితీసింది. ఎన్టీఆర్ డైలాగ్‌ చుట్టు వివాదం మొదలైంది. దీనిపై హీరో వరుణ్ తేజ్ స్పందించారు. మూవీ ప్రెస్‌మీట్‌కు హాజరైన ఆయన డైలాగ్‌పై క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇందులో తాము సీనియర్ ఎన్టీఆర్‌ను అగౌరపరచలేదని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఆయనపై మేము ట్రోల్ చేయలేదని.. కేవలం ఇమిటేట్ మాత్రమే చేశామని క్లారిటీ ఇచ్చారు. ట్రోలింగ్‌కు.. ఇమిటేషన్‌కు చాలా తేడా ఉందన్నారు. గొప్ప గొప్ప నటులను ఇమిటేట్ చేస్తారని అన్నారు. ఎవరినీ తక్కువ చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. ఇందులో ఫన్నీ మాత్రమే చూడాలని ఆడియన్స్‌ను వరుణ్ తేజ్ కోరారు. కాగా.. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement