కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్.
ఈ నేపథ్యంలోనే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని పుల్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్‌గా డ్రామాగా రూపొందించారని ట్రైలర్‌లో తెలిసిపోతోంది. 'గెలిచేదాకా ఆగకూడదు.. గెలిచాక ఎక్కువగా మాట్లాడకూడదు' అనే డైలాగ్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రంలో సూర్య 40 ఏళ్ల వ్యక్తిగా, మమిత బైజు 20 ఏళ్ల అమ్మాయిగా నటించారు. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.


