హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉన్నారు. ఇటీవలే అరుణాచలం సందర్శించిన బ్యూటీ.. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే వీఐపీ సంప్రదాయానికి భిన్నంగా శ్రీలీల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సామాన్య భక్తురాలిగా సర్వదర్శనం క్యూ లైన్‌లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో శ్రీలీల నిర్ణయంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది. పెళ్లి సందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ధమాకా, భగవంత్ కేసరి, రాబిన్‌హుడ్, మాస్ జాతర లాంటి సినిమాల్లో మెప్పించింది. ఈ ఏడాది పరాశక్తి మూవీతో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రజినీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది.
#SreeLeela visited Tirupati to seek blessings 🙏
Humble way as she opted for common queue darshan, avoids VVIP access 👏pic.twitter.com/OO9Cns4bfF— Balaji (@RDBalaji) August 7, 2026


