గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసిన శ్రీలీల? | Sreeleela Reportedly Bags Key Role In Rajinikanth 173rd Film Dharman, Rumours Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసిన శ్రీలీల?

Aug 7 2026 10:22 AM | Updated on Aug 7 2026 10:46 AM

Sreeleela Bags a Superstar Film

శ్రీలీల.. ఈ తార కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె డాన్స్‌కి, యాక్టింగ్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. వరుస అవకాశాలు అందుకుంటున్నా.. విజయాలు మాత్రం ఆమెకు దూరంగానే ఉంటున్నాయి. అంతేకాదు.. మధ్యలో తప్పుకున్న లెనిన్‌ సినిమా  బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో  శ్రీలీలకు ఏదీ కలిసి రావడం లేదని అభిమానులు నిరాశపడుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీలీలకు ఓ భారీ అవకాశం దక్కిందనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా మారుతున్న ఈ హీరోయిన్‌కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో చోటు దక్కిందని టాక్ . ఇంతకీ శ్రీలీలకు అవకాశం ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా? సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన 173వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ధర్మాన్' సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో శ్రీలీల మరోసారి విజయాల బాట పడుతుందో లేదో చూడాలి మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement