సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా | Mrp Movie 2026 Telugu Ott Streaming Now | Sakshi
Sakshi News home page

MRP OTT: తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. సడన్ స్ట్రీమింగ్

Aug 7 2026 8:29 AM | Updated on Aug 7 2026 8:40 AM

Mrp Movie 2026 Telugu Ott Streaming Now

ఓటీటీల్లో ఈ వారం బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. వీటిలో లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి, వంద దేవుళ్లు, డార్క్ సీక్రెట్స్, వదంది 2, సఫేద్ సాగర్, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఓ తెలుగు క్రైమ్ కామెడీ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా రెండు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి?

నరేశ్ అగస్త్య, సుదర్శన్, రాజ్ కసిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఎమ్మార్పీ'. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది కానీ సరైన కంటెంట్ లేకపోవడంతో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మూడు వారాలు తిరిగేసరికల్లా అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

'ఎమ్మార్పీ' విషయానికొస్తే.. మనోహర్(నరేష్ అగస్త్య), రవి(కసిరెడ్డి రాజ్ కుమార్), పరమేశ్వరరావు(సుదర్శన్) ఫ్రెండ్స్. కలిసి ఓ బిజినెస్ చేద్దామని ఓ రౌడీ షీటర్ రూ.50 లక్షలు అప్పు తీసుకుంటారు. బిజినెస్‌లో నష్టాలు రావడంతో వడ్డీ కూడా కట్టలేకపోతారు. అనుకోని పరిస్థితుల్లో వీళ్లు సదరు రౌడీ షీటర్ ఇంటికెళ్లిన టైంలో అతడి తండ్రి చనిపోతాడు. అయితే ఆ శవాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించి తమ అప్పు తీర్చాలని వీళ్లు ముగ్గురు అనుకుంటారు. తీరా కిడ్నాప్ చేసిన తర్వాత చూస్తే ఓ మహిళ శవం ఉంటుంది.  ఇంతకీ ఆమె ఎవరు? చివరకు వీళ్ల ముగ్గురి పరిస్థితి ఏమైందనేదే మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement