గరివిడి లక్ష్మి.. థియేటర్లకు వచ్చేస్తోంది..! | Garividi Lakshmi Movie Release Date Officially announced by Makers | Sakshi
Sakshi News home page

Garividi Lakshmi Movie: గరివిడి లక్ష్మి.. థియేటర్లకు వచ్చేస్తోంది..!

Sep 21 2026 8:01 PM | Updated on Sep 21 2026 8:14 PM

Garividi Lakshmi Movie Release Date Officially announced by Makers

నిజజీవిత కథలు, సంఘటనలు స్ఫూర్తిగా రాబోతున్న మరో మూవీ 'గరివిడి లక్ష‍్మి'. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 'నల్లజీలకర్ర మొగ్గ' అని సాగే ఓ పాటని రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 90ల కాలంలో దాదాపు 15 ఏళ్లలో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష‍్మీ అనే ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో లక్ష‍్మీ పాత్రలో ఆనంది కనిపించనుంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 17న విడుదల చేయనున్నట్లు ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నరేశ్, రాగ్‌ మయూర్, శరణ్య ప్రదీప్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు  గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement