థియేటర్లలో ది ప్యారడైజ్.. ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్..! | This week Ott Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

This week Ott Movies: థియేటర్లలో ది ప్యారడైజ్.. ఈ వారం ఓటీటీల్లో చిత్రాలివే..!

Sep 21 2026 4:37 PM | Updated on Sep 21 2026 4:49 PM

This week Ott Release Movies List Goes Viral

చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. ప్రస్తుతం ప్రజలంతా వినాయక చవితి వేడుకలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పల్లెల్లో పండుగ సందడి ముగిసినా.. నగరాల్లో ఇంకా కొనసాగుతోంది. ఇక వారంలో సినీ ప్రియులను అలరించేందుకు నాని ది ప్యారడైజ్ అంటూ దూసుకొస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ హైప్ ఉంది. దీంతో పాటు రాగ్ మయూర్‌ అనుమాన పక్షి ఒక్క రోజు గ్యాప్‌లోనే థియేటర్లలో విడుదల కానుంది.

ఇక ఓటీటీల విషయానికొస్తే పలు కొత్త సినిమాలు ఈ వారంలో సందడి చేయనున్నాయి. తెలుగు హారర్ థ్రిల్లర్ అగధ మూవీ, బాలీవుడ్ నుంచి పరిణీతి చోప్రా ఎంట్రీ ఇస్తోన్న వెబ్ సిరీస్ షాక్ ట్రస్ట్ నో వన్ అలరించనుంది. అంతేకాకుండా హిందీ మూవీ హుంకార్‌ ది రోర్, మ్యాంగో పచ్చా లాంటి మలయాళ చిత్రం ఓటీటీకి రానున్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారంలో అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఏయే  మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. 

నెట్‌ఫ్లిక్స్..

  • మినర్వా అకాడమీ(హాలీవుడ్ మూవీ)-  సెప్టెంబర్ 22

  • హెబియస్ కార్పస్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 23

  • మై శ్యాడ్‌ డెడ్(హాలీవుడ్ మూవీ)-  సెప్టెంబర్ 24

  • బ్లడీ లెగాసీ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 24

  • షాక్‌ ట్రస్ట్ నో వన్(హిందీ సిరీస్)- సెప్టెంబర్ 24

  • ది డిఫరెంట్ వరల్డ్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 24

  • ది ఫైనల్ ప్రాబ్లమ్(హాలీవుడ్ మూవీ)-  సెప్టెంబర్ 25

  • యునాబాంబర్ (హాలీవుడ్ మూవీ)-  సెప్టెంబర్ 25


అమెజాన్ ప్రైమ్ వీడియో..

  • ది లవ్ హైపోథసిస్(హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 23

  • డోంట్‌ బి షై(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25

జియో హాట్‌స్టార్..

  • హుంకార్‌ ది రోర్ (హిందీ మూవీ)- సెప్టెంబర్ 25

  • మ్యాంగో పచ్చా(మలయాళ మూవీ)- సెప్టెంబర్ 25

జీ5

  • బకైతీ సీజన్-2(హిందీ సిరీస్)- సెప్టెంబర్ 25

  • అగధ(తెలుగు సినిమా)- సెప్టెంబర్ 25

ఆపిల్ టీవీ..

  • బ్రదర్స్-(హాలీవుడ్ చిత్రం)- సెప్టెంబర్ 23


అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్..

  • రైజ్ అండ్ ఫాల్ సీజన్-2 (హిందీ సిరీస్)- సెప్టెంబర్ 26
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement