ఐపీవో రష్‌: ఈ వారం 6 కంపెనీలు రెడీ | IPO Rush 6 Companies to Raise 3825 Crore This Week | Sakshi
Sakshi News home page

ఐపీవో రష్‌: ఈ వారం 6 కంపెనీలు రెడీ

Sep 21 2026 4:09 PM | Updated on Sep 21 2026 4:17 PM

IPO Rush 6 Companies to Raise 3825 Crore This Week

ఈ నెలలో మరింత జోరందుకున్న ప్రైమరీ మార్కెట్ల ఖుషీ ఈ వారం సైతం కొనసాగనుంది. ఆరు కంపెనీలు ఉమ్మడిగా రూ. 3,825 కోట్లు సమీకరించేందుకు ఇష్యూలను చేపట్టనున్నాయి. జాబితాలో ఎలివేట్‌ క్యాంపసస్, వర్మోరా గ్రానైటో, ఏ–వన్‌ స్టీల్స్‌ ఇండియా, అర్మీ ఇన్ఫోటెక్, స్వస్తికా ఇన్‌ఫ్రా, అడ్రాయిట్‌ ఇండస్ట్రీస్‌ చేరాయి. ఇప్పటికే సెప్టెంబర్‌లో 17 కంపెనీల ఐపీవోలు పూర్తికాగా.. నేడు(21న) ముగియనున్న స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ అతిపెద్ద ఇష్యూగా నిలవనున్న సంగతి తెలిసిందే. టెక్స్‌టైల్‌ తయారీ కంపెనీ సోనాసెలక్షన్‌ ఇండియా ఇష్యూ సైతం నేడు ముగియనుంది.  

నిధుల వినియోగమిలా.. 
తాజాగా ఐపీవోకు వస్తున్న కంపెనీలు ఈక్విటీ జారీ నిధులను ప్రధానంగా వ్యాపార విస్తరణ, పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులతోపాటు.. వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనున్నాయి. ఈ ఇష్యూలతో కలిపి 2026లో ఇప్పటివరకూ 87 కంపెనీలు లిస్టింగ్‌ బాటలో సాగడం గమనార్హం! ఆగస్ట్‌లో 23 కంపెనీలు ఐపీవోకు వచి్చన విషయం విదితమే. ప్రధానంగా జూలై, ఆగస్ట్‌లలో ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కాయి. ఈ ఏడాది సమీకరించిన రూ. 83,062 కోట్ల ఐపీవో నిధులలో 60 శాతం ఈ రెండు నెలలోనే అందుకోవడం విశేషం! ఈ స్పీడ్‌ కొనసాగితే 2025లో నమోదైన నిధుల సమీకరణను 2026 దాటే వీలున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి 167 కంపెనీలకు అనుమతి లభించింది. తద్వారా రూ. 3.06 లక్షల కోట్ల సమీకరణకు వీలుంది. అంతేకాకుండా మరో 71 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమకూర్చుకునేందుకు సెబీ అనుమతి కోసం చూస్తున్నాయి.

వర్మోరా గ్రానైటో 
టైల్స్, బాత్‌వేర్‌ తయారీ కంపెనీ వర్మోరా గ్రానైటో ఐపీవో రేపు(22న) ప్రారంభంకానుంది. 24న ముగియనున్న ఇష్యూకి రూ. 140–148 ధరల శ్రేణి ప్రకటించింది. దీనిలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని జారీసహా రూ. 388 కోట్ల విలువైన 2.62 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారు సంస్థ కస్తూర ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆఫర్‌ చేస్తోంది. తద్వారా రూ. 708 కోట్ల సమీకరణపై కన్నేసింది.  

ఎలివేట్‌ క్యాంపసస్‌ 
హిల్‌హౌస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు పెట్టుబడులున్న ఎలివేట్‌ క్యాంపసస్‌ ఐపీవో బుధవారం(23న) ప్రారంభంకానుంది. 25న ముగియనున్న ఇష్యూకి రూ. 343–362 ధరల శ్రేణి ప్రకటించింది. పూర్తిగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 2,100 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది.  

ఏ–వన్‌ స్టీల్స్‌ ఇండియా 
గురువారం(24న) ప్రారంభంకానున్న ఐపీవో ద్వారా సమీకృత స్టీల్‌ తయారీ కంపెనీ ఏ–వన్‌ స్టీల్స్‌ ఇండియా రూ. 405 కోట్ల సమీకరణపై దృష్టి పెట్టింది. 28న ముగియనున్న ఇష్యూకి రూ. 385–405 ధరల శ్రేణి నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా రూ. 355 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు.. రూ. 50 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.  

స్వస్తికా ఇన్‌ఫ్రా 
విద్యుత్‌ పంపిణీ, మౌలిక సదుపాయ ప్రాజెక్టులకు ఈపీసీ సొల్యూషన్లు అందిస్తున్న స్వస్తికా ఇన్‌ఫ్రా పబ్లిక్‌ ఇష్యూ 23న ప్రారంభంకానుంది. 25న ముగియనున్న ఇష్యూకి రూ. 175–185 ధరల శ్రేణి నిర్ణయించింది. తద్వారా రూ. 161 కోట్ల సమీకరణపై కన్నేసింది.  

అడ్రాయిట్‌ ఇండస్ట్రీస్‌ 
ప్రొఫెల్లర్‌ షాఫ్ట్స్, టార్క్‌ ట్రాన్స్‌మిషన్‌ విడిభాగాల తయారీ కంపెనీ అడ్రాయిట్‌ ఇండస్ట్రీస్‌ (ఇండియా) పబ్లిక్‌ ఇష్యూ 23న ప్రారంభంకానుంది. 25న ముగియనున్న ఇష్యూకి రూ. 126–134 ధరల శ్రేణి ప్రకటించింది. తద్వారా రూ. 151 కోట్ల సమీకరణకు సిద్ధపడుతోంది.

ఆర్‌మీ ఇన్ఫోటెక్‌ @ రూ. 375 
టెక్నాలజీ మౌలిక సదుపాయాల సంస్థ ఆర్‌మీ ఇన్ఫోటెక్‌ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ సెప్టెంబర్‌ 23న ప్రారంభమై 25న ముగియనుంది. ఇందుకు సంబంధించి షేరు ధర శ్రేణి రూ. 350–375గా ఉంటుంది. కనీస లాట్‌ పరిమాణం 40 షేర్లు.ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 300 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 155 కోట్లను వ్యాపార విస్తరణకు, రూ. 60 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, మిగతా మొత్తాన్ని నిర్దిష్ట రుణాల చెల్లింపు, ఇతర కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించుకోనుంది.

21 నుంచి ఎఫ్‌ఎక్స్‌ మల్టీటెక్‌ 
పారిశ్రామిక రిఫ్రిజిరేషన్‌ సొల్యూషన్స్‌ అందించే ఎఫ్‌ఎక్స్‌ మలీ్టటెక్‌ తలపెట్టిన పబ్లిక్‌ ఇష్యూ సెప్టెంబర్‌ 21న ప్రారంభమై 23న ముగియనుంది. కంపెనీ దీని ద్వారా రూ. 45.24 కోట్లు సమీకరించనుంది. బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫాంలో లిస్ట్‌ చేయనున్నారు. ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 110–116గా ఉంటుంది. లాట్‌ సైజు 1,200 షేర్లు కాగా, రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement