సీనియర్ హీరోయిన్ రాధ కుటుంబంలో వివాదం నెలకొంది. తన చెక్‌లను దుర్వినియోగం చేశారని రాధ ఆరోపిస్తూ చెన్నై కోర్టును ఆశ్రయించింది. తన సోదరి అంబిక, సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌పై గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. తాను సంతకం చేసిన ఖాళీ చెక్కులను దొంగిలించారని రాధ తన ఫిర్యాదులో పేర్కొంది.
తన చెక్‌లను తస్కరించి దాదాపు రూ.46 కోట్ల మోసానికి పాల్పడ్డారని రాధ ఆరోపిస్తోంది. ఆ చెక్కులను తన సోదరుడు మల్లికార్జున, తన సోదరి అంబిక కలిసి ఈ పని చేశారని రాధ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు.. తన ప్రమేయం లేకుండా తన గది నుంచే ఆ చెక్కులను తీసుకున్నారని తెలిపారు. తాను ఆ చెక్కులను తన సోదరికి ఎప్పుడూ ఇవ్వలేదని.. వెంటనే చెల్లింపులను నిలిపివేయమని బ్యాంకు అధికారులకు సూచించినట్లు రాధ వెల్లడించింది.
అంతేకాకుండా విలువైన వస్తువులు, నగలు, ఆస్తి పత్రాలు, ఇతర రికార్డులు ఉంచిన తన ఆస్తి భాగాన్ని తీసుకోకుండా అంబిక, మల్లికార్జున తనకు రాకుండా అడ్డుకున్నారని కూడా రాధ ఆరోపించారు. విచారణ జరిపి వారిద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


